Site icon NTV Telugu

Asia Cup 2025: అభిమానులకు కీలక అప్‌డేట్‌.. ఆసియా కప్‌ షెడ్యూల్‌లో మార్పు!

Asia Cup 2025

Asia Cup 2025

Asia Cup 2025 Schedule Update: క్రికెట్ అభిమానులకు కీలక అప్‌డేట్‌. ఆసియా కప్‌ 2025 షెడ్యూల్‌లో స్వల్ప మార్పు చోటుచేసుకుంది. టోర్నీలో మొత్తం 19 మ్యాచ్‌లు ఉండగా.. 18 మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ఆరంభం అవుతాయి. సెప్టెంబరు 15న అబుదాబిలోని జాయేద్‌ క్రికెట్‌ స్టేడియంలో యూఏఈ, ఒమన్‌ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌ టైమింగ్‌లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ఈ మ్యాచ్ ముందు ప్రకటించినట్టుగానే రాత్రి 5.30కు ప్రారంభం అవుతుంది. ఈ మేరకు ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు శనివారం ప్రకటించింది.

ఆసియా కప్‌ 2025లోని 19 మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7:30 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటలకు) ప్రారంభం కావాల్సి ఉంది. అయితే 18 మ్యాచ్‌ల ప్రారంభ సమయాన్ని ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు అరగంట వెనక్కి జరిపి.. రాత్రి 8 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 6:30 గంటలకు) మార్చారు. సెప్టెంబరులో యూఏఈలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉందనున్న నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బ్రాడ్‌కాస్టర్ల అభ్యర్థన మేరకు మ్యాచ్‌ సమయాల్లో స్వల్ప మార్పులు చేసినట్లు సమాచారం.

Also Read: Vadapalli Temple: వెంకన్న స్వామి ఆలయంలో పిస్టల్‌తో వ్యక్తి హాల్‌చల్.. భయబ్రాంతులకు గురైన భక్తులు!

2025 ఆసియా కప్ సెప్టెంబర్ 9న ప్రారంభమవుతుంది. అబుదాబిలో జరిగే టోర్నీ మొదటి మ్యాచ్‌లో అఫ్ఘానిస్తాన్, హాంకాంగ్‌ జట్లు తలపడనున్నాయి. దుబాయ్ స్టేడియంలో సెప్టెంబరు 28న ఫైనల్‌ మ్యాచ్‌ జరుగుతుంది. ఈసారి టీ20 ఫార్మాట్లో ఈవెంట్‌ జరగనుంది. టోర్నీలో ఎనిమిది జట్లు పాల్గొంటుండగా.. రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్‌-ఎలో భారత్‌, పాకిస్తాన్‌, ఒమన్‌, యూఏఈ టీమ్స్ ఉండగా.. గ్రూప్‌-బిలో శ్రీలంక, బంగ్లాదేశ్‌, అఫ్గనిస్తాన్‌, హాంకాంగ్‌ ఉన్నాయి.

Exit mobile version