Site icon NTV Telugu

Pakistan vs Sri Lanka: డూ-ఆర్-డై.. ఈ మ్యాచ్ ఓడిపోతే పాకిస్థాన్ ఇంటికేనా..?

Pak

Pak

Pakistan vs Sri Lanka: 2025 ఆసియా కప్‌లో పాకిస్థాన్ నేడు శ్రీలంకతో తలపడుతుంది. ఇది పాకిస్థాన్‌కు డూ-ఆర్-డై మ్యాచ్. ఈరోజు పాకిస్థాన్ ఓడిపోతే, ఫైనల్‌కు చేరుకోవాలనే ఆశలు అడియాశలుగా మారిపోతాయి. శ్రీలంక కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటోంది. రెండు జట్లు తమ తొలి సూపర్ ఫోర్ మ్యాచ్‌లో పరాజయాలను చవిచూశాయి. శ్రీలంక తన తొలి సూపర్ ఫోర్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ చేతిలో నాలుగు వికెట్ల తేడాతో ఓడిపోయింది. మరోవైపు, పాకిస్థాన్ తన సూపర్ ఫోర్ ఓపెనర్‌లో భారత్‌ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టు దాదాపుగా ఇంటిదారి పడుతుంది.

READ MOPRE: USA: ట్రంప్ ప్రసంగానికి ముందు, అమెరికాలో భారీ కుట్ర భగ్నం..

సూపర్ 4 స్టాండింగ్స్‌లో భారత్, బంగ్లాదేశ్ చెరో రెండు పాయింట్లను కలిగి ఉన్నాయి. సూర్యకుమార్ యాదవ్ జట్టు మెరుగైన నెట్ రన్ రేట్ కారణంగా పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. భారత్ తో ఓటమి అనంతరం.. పాక్ నెట్ రన్ రేట్ (NRR)ను -0.689కి పడిపోయింది. ఫలితంగా, సూపర్ ఫోర్ పాయింట్స్ టేబుల్‌లో పాకిస్థాన్ ప్రస్తుతం చివరి స్థానంలో ఉంది. శ్రీలంక, పాకిస్థాన్ వరుసగా మూడు, నాల్గవ స్థానాల్లో ఉన్నాయి. పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అఘా తీవ్ర ఒత్తిడిలో డూ-ఆర్-డై పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. ఇక నేటి మ్యాచ్ లో శ్రీలంక ఎలాగైనా గెలవాలని భారత్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

READ MOPRE: మేడారం సమ్మక్క-సారలమ్మ గద్దెల ప్రాంగణం మాస్టర్ ప్లాన్ విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి..

పాకిస్థాన్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11: సైమ్ అయూబ్, సాహిబ్జాదా ఫర్హాన్, మహ్మద్ హరీస్ (వికెట్ కీపర్), ఫఖర్ జమాన్, సల్మాన్ అలీ అఘా (కెప్టెన్), ఫహీమ్ అష్రఫ్, హుస్సేన్ తలాత్, మహ్మద్ నవాజ్, షాహీన్ షా ఆఫ్రిది, హరీస్ రవూఫ్ మరియు అబ్రర్ అహ్మద్.

శ్రీలంక ప్రాబబుల్ ప్లేయింగ్ 11: పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్ (వికెట్ కీపర్), కమిల్ మిషార, కుసల్ పెరీరా, చరిత్ అసలంక (కెప్టెన్), దసున్ షనక, కమిందు మెండిస్, వనిందు హసరంగా, దునిత్ వెలలాగే, దుష్మంత చమీర, నువాన్ తుషార.

Exit mobile version