Site icon NTV Telugu

Asia Cup 2025: ఆసియాకప్ చరిత్రలో ఇండియా – పాక్ జట్లు ఆసక్తికర ముచ్చట..

Asia Cup 2025

Asia Cup 2025

Asia Cup 2025: ఆసియాకప్ 17వ ఎడిషన్ ప్రారంభం కావడంతో క్రికెట్ అభిమానులకు పండుగ మొదలైంది. ఆసియా కప్‌లో భారత్, పాకిస్థాన్ మధ్య జరిగే మ్యాచ్‌‌లు అంటే అభిమానుల ఆసక్తిని వర్ణించడం సాధ్యం కాదు. ఆసియా కప్ 2025లో భాగంగా ఆదివారం (సెప్టెంబర్ 14) దుబాయ్‌లో జరిగే రెండో గ్రూప్ A మ్యాచ్‌లో టీమ్ ఇండియా పాకిస్థాన్‌తో తలపడనుంది. ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదిక కానుంది. ఈ ఏడాది ప్రారంభంలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్ పాకిస్థాన్‌ను ఆరు వికెట్ల తేడాతో ఓడించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అజేయ సెంచరీ సాధించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు. శ్రేయాస్ అయ్యర్ 67 బంతుల్లో 56 పరుగులు చేశాడు.

READ ALSO: India’s Big Sports Day: క్రికెట్‌లో పాక్‌.. హాకీలో చైనా.. సూపర్ సండే రోజు భారత్‌కు డబుల్ ‘పరీక్ష’..!

ఈసారి ఆసియా కప్ 2025 టోర్నీలో 8 జట్లు పాల్గొంటున్నాయి. ఆసియాకప్ చరిత్రలో భారత్ అత్యధికంగా 8 సార్లు విజేతగా నిలిచి రికార్డ్ సృష్టించింది. తర్వాత స్థానంలో ఆరుసార్లు శ్రీలంక, రెండు సార్లు పాకిస్థాన్ టైటిల్స్ సాధించాయి. ఈ టోర్నీలో బంగ్లాదేశ్, అఫ్ఘానిస్థాన్ కూడా పాల్గొంటున్నప్పటికీ అవి ఒక్కసారి కూడా టైటిల్ సాధించలేకపోయాయి. బంగ్లాదేశ్ చాలాసార్లు ఫైనల్ వరకూ చేరినా.. టైటిల్ మాత్రం చేజిక్కించుకోలేకపోయింది.

మీకు తెలుసా.. భారత్, పాక్ జట్లు ఒక్కసారి కూడా ఆసియాకప్ ఫైనల్‌లో తలపడలేదు. 1984లో ప్రారంభమైన ఆసియాకప్ చరిత్రను పరిశీలిస్తే ఈ రెండు జట్లు ఫైనల్‌లో ఒక్కసారి కూడా పాల్గొనలేదు. అయితే చాలా సార్లు ఈ రెండు జట్లు ఒకే గ్రూప్‌లో ఉండి, గ్రూప్‌ స్టేజ్‌లో మ్యాచ్‌లు ఆడాయి. ఇక్కడ విశేషం ఏమిటంటే ఫైనల్‌కు మాత్రం భారత్ లేదా పాకిస్థాన్ మాత్రమే వెళ్తుండేవి. రెండూ కలిసి ఆసియాకప్ చరిత్రలో ఇప్పటి వరకు ఫైనల్ మ్యాచ్ ఆడలేదు.

భారత్, పాక్ జట్లు ఆసియాకప్‌లో ఇప్పటివరకు 18 మ్యాచ్‌లలో తలపడ్డాయి. ఇందులో భారత్‌ 10 మ్యాచ్‌లలో గెలిస్తే, ఆరింట్లో పాక్ విజయం సాధించింది. రెండు మ్యాచ్‌లలో ఫలితం రాలేదు. ఫార్మాట్ విషయానికి వస్తే 15 మ్యాచ్‌లు వన్డే ఫార్మాట్‌లో జరగ్గా.. ఎనిమిదింట్లో భారత్.. ఐదింట్లో పాక్ గెలిచాయి. మూడు టీ20 మ్యాచ్‌లలో రెండింట్లో భారత్, ఒకసారి పాక్ విజయం సాధించాయి. ఆసియాకప్ చరిత్రలో ఒక్కసారి కూడా ఫైనల్‌లో తలపడని భారత్, పాక్‌ ఈసారి ఏం చేస్తాయో చూడాలని క్రికెట్ ప్రేమికులు ఎదురుచూస్తున్నారు.

READ ALSO: Dalapathi Vijay: ‘ఐ యామ్ కమింగ్’ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన దళపతి విజయ్

Exit mobile version