ఆసియా కప్ 2025లో భాగంగా దుబాయ్ వేదికగా మరికొద్దిసేపట్లో భారత్, యూఏఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. వికెట్ చాలా ఫ్రెష్‌గా ఉందని, రెండో ఇన్నింగ్స్‌లో మంచు పడే అవకాశాలు ఉన్నాయని సూర్య చెప్పాడు. ఇక్కడ 3-4 మంచి ప్రాక్టీస్ సెషన్లు చేశామని చెప్పాడు. అయితే భారత తుది జట్టు అందరి అంచనాలకు బిన్నంగా ఉంది.
ఓపెనర్లుగా శుబ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ బరిలోకి దిగనున్నారు. ప్లేయింగ్ ఎలెవన్‌లో కీపర్ సంజూ శాంసన్‌కు చోటు దక్కింది. అయితే సంజూ మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు రానున్నాడు. గత కొన్ని రోజులుగా సంజూకు స్థానం దక్కదు అని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అలానే అనూహ్యంగా శివమ్ దూబేకు చోటు దక్కింది. స్పిన్ కోటాలో అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి ఆడనున్నారు. జస్ప్రీత్ బుమ్రా ఒక్కడే పేస్ భారాన్ని మోయనున్నాడు.
తుది జట్లు:
భారత్: అభిషేక్ శర్మ, శుభమన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, సంజు శాంసన్ (కీపర్), శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి.
యూఏఈ: ముహమ్మద్ వసీమ్ (కెప్టెన్), అలీషాన్ షరాఫు, ముహమ్మద్ జోహైబ్, రాహుల్ చోప్రా (కీపర్), ఆసిఫ్ ఖాన్, హర్షిత్ కౌశిక్, హైదర్ అలీ, ధ్రువ్ పరాశర్, ముహమ్మద్ రోహిద్ ఖాన్, జునైద్ సిద్ధిక్, సిమ్రంజీత్ సింగ్.
