Site icon NTV Telugu

Asia Cup 2025: పీసీబీకి ఐసీసీ ఈమెయిల్‌.. పాకిస్థాన్‌పై చర్యలు?

Pcb Pakistan

Pcb Pakistan

ఆసియా కప్‌ 2025 గ్రూప్ స్టేజ్‌లో భాగంగా సెప్టెంబర్ 14 భారత్, పాకిస్థాన్‌ టీమ్స్ తలపడ్డాయి. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో టాస్, మ్యాచ్ అనంతరం పాక్ ఆటగాళ్లతో భారత్ ప్లేయర్స్ కరచాలనం చేయలేదు. మ్యాచ్‌ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌ నిబంధనలు ఉల్లంఘించాడని, టోర్నీ నుంచి అతడిని తొలగించాలని ఏసీసీకి పీసీబీ ఫిర్యాదు చేసింది. మ్యాచ్‌ రిఫరీని తొలగించకుంటే తాము టోర్నీని బహిష్కరిస్తామని పీసీబీ ఏసీసీని హెచ్చరించింది. ఈ విషయంపై ఐసీసీని ఏసీసీ సాయం కోరింది. మ్యాచ్ రిఫరీని తొలగించాలన్న పీసీబీ డిమాండ్‌ను ఐసీసీ సున్నితంగా తిరస్కరించింది.

Also Read: India vs Oman: నేడు ఒమన్‌తో భారత్‌ ఢీ.. రెండు మార్పులు తప్పవా? తుది జట్లు ఇవే

ఆసియా కప్‌ 2025 టోర్నీని బహిష్కరిస్తామన్న పాకిస్థాన్‌.. యూఏఈతో మ్యాచ్ సమయంలో నిరసనకు దిగింది. దాంతో మ్యాచ్‌ గంట ఆలస్యంగా మొదలైంది. యూఏఈతో మ్యాచ్‌కు కాసేపటి ముందు రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌.. పాక్ టీమ్‌ కోచ్, కెప్టెన్‌, మేనేజర్‌తో మాట్లాడి క్షమాపణలు చెప్పాడని పీసీబీ ఓ ప్రకటన రిలీజ్ చేసింది. రిఫరీ క్షమాపణలు చెప్పిన కారణంగానే తాము యూఏఈతో మ్యాచ్ ఆడుతున్నట్లు పీసీబీ పేర్కొంది. యూఏఈతో మ్యాచ్‌ సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించినందుకు పాకిస్థాన్‌పై చర్యలు తీసుకునేందుకు ఐసీసీ సిద్దమైంది. ఈ మేరకు పీసీబీకి ఓ ఈమెయిల్‌ చేసింది. త్వరలోనే చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. మ్యాచ్‌ రిఫరీ క్షమాపణ చెప్పాడని పీసీబీ చెప్పడాన్ని కూడా ఐసీసీ తప్పు పట్టింది.

Exit mobile version