Asia Cup 2025 Prize Money: దాయాదుల పోరుకు రంగం సిద్ధమైంది. ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌కు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదిక అయ్యింది. ఆదివారం భారత్, పాకిస్థాన్ జట్లు తలపడుతున్నాయి. మరికొన్ని గంటల్లో మ్యాచ్ ఫలితం తేలనుంది. ఇక్కడ విశేషం ఏమిటంటే గెలిచిన జట్టుకు కోట్ల రూపాయలు అందుతాయి. ఇది కామన్ కదా అని అనుకుంటున్నారు కదా.. ఇక్కడే ట్విస్ట్ ఉంది.. ఓడిపోయిన జట్టు కూడా సూపర్ రిచ్ అవుతుంది. ఇంతకీ ఈ ఓడిపోయిన, గెలిచిన జట్లకు ఎన్ని కోట్లు వస్తాయో తెలుసా.. ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ ALSO: Jr NTR: ఇలాంటి సినిమా చేయడం అసాధ్యం, రిషబ్ వల్లే సాధ్యమైంది!
టైటిల్ ఫేవరెట్‌గా భారత్..
ఈ ఆసియా కప్‌లో ఫైనల్‌లో భారత జట్టు గెలవడానికి ఫేవరెట్ అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఆసియా కప్‌లో ఇప్పటికే భారత్ రెండుసార్లు పాకిస్థాన్‌ను ఓడించింది. వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో గెలిచి టీం ఇండియా ఫైనల్‌కు చేరుకుంది. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని భారత జట్టు తొమ్మిదోసారి ఛాంపియన్‌గా నిలవాలని ఇండియా అభిమానులు కోరుకుంటున్నారు. రెండేళ్ల క్రితం 2023లో చివరిసారిగా ఆసియా కప్ జరిగింది. ఆ సమయంలో భారత్ ఫైనల్‌లో శ్రీలంకను ఓడించి ఎనిమిదోసారి ఆసియా కప్ ట్రోఫీని ముద్దాడింది. ఈసారి ఆసియా కప్‌ను T20 ఫార్మాట్‌లో నిర్వహిస్తున్నారు. ఫార్మాట్‌లో మార్పుతో పాటు, ప్రైజ్ మనీ కూడా మారిపోయిందని టాక్. ప్రైజ్ మనీ గతంలో పోల్చితే 50 శాతం పెరిగింది. 2023లో ఛాంపియన్‌గా నిలిచిన భారత్ రూ.1.25 కోట్ల ప్రైజ్ మనీని అందుకుంది.
26 మిలియన్ల గిఫ్ట్.. ?
పలు నివేదికల ప్రకారం.. ఈ ఏడాది ఆసియా కప్ ట్రోఫీని గెలుచుకున్న జట్టుకు 26 మిలియన్ల బహుమతి లభిస్తుంది. గత సీజన్‌తో పోలిస్తే ఈ మొత్తం 50 శాతం ఎక్కువ. ఓడిపోయిన జట్టుకు US$150,000 అందుతుందని అంచనా. అయితే, బహుమతి నగదుపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.
అవార్డుల రేసులో ఇద్దరు ఇండియన్స్..
ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఛాంపియన్, రన్నరప్‌లకు ప్రైజ్ మనీతో పాటు ఆటగాళ్లకు వ్యక్తిగత అవార్డులు కూడా రానున్నాయి. ఈ అవార్డుల రేసులో ఇద్దరు భారతీయ ఆటగాళ్లు ముందంజలో ఉన్నారు. అభిషేక్ శర్మ అత్యధిక పరుగులు చేయడం ద్వారా ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డుకు గట్టి పోటీదారుగా ఉన్నారు. అలాగే కుల్దీప్ యాదవ్ కూడా టోర్నిలో అత్యధిక వికెట్లు తీసి అభిషేక్‌కు గట్టి పోటీ ఇస్తున్నాడు. ఫైనల్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన ఆటగాళ్లకు కూడా ప్రత్యేక బహుమతి లభిస్తుంది. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ ఆటగాడికి ఈసారి రూ.12.5 లక్షలు లభిస్తాయని టాక్.
READ ALSO: Rudraksha Switzerland Demand: క్రైస్తవ దేశంలో రుద్రాక్షలకు డిమాండ్.. ఎందుకంటే!
