Asia Cup 2025: ఆసియా కప్ 2025లో పాకిస్తాన్ క్రికెట్ జట్టు తమ చివరి గ్రూప్ మ్యాచ్‌ను ఆడకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)తో జరగాల్సిన ఈ మ్యాచ్‌ను “హ్యాండ్‌షేక్ వివాదం” కారణంగా ఆడకుండా బహిష్కరించినట్లు సమాచారం. అందిన నివేదిక ప్రకారం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) ఈ నిర్ణయం తీసుకునట్లు సమాచారం. మ్యాచ్ రెఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌పై సరిగా వ్యవహరించలేదని పాకిస్తాన్ ఆరోపించింది. ఈ ఆరోపణల నేపథ్యంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) ఐసీసీకి ఒక లేఖ రాసింది. ఈ మ్యాచ్‌కు పైక్రాఫ్ట్‌ను తొలగించాలని డిమాండ్ చేసింది. అయితే, ఐసీసీ ఈ అభ్యర్థనను తిరస్కరించడంతో పాకిస్తాన్ ఈ నిర్ణయం తీసుకుంది.
భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన గత మ్యాచ్‌లో ఈ వివాదం మొదలైంది. మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన జట్టుతో కలిసి పాకిస్తాన్ ఆటగాళ్లతో కరచాలనం చేయడానికి నిరాకరించారు. ఇటీవల పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి బాధితులకు సంఘీభావంగా, భారత సాయుధ బలగాలకు మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సూర్యకుమార్ యాదవ్ వివరించారు. దీనికి నిరసనగా పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ వేడుకకు హాజరు కాలేదు.
Tummala Nageswara Rao : రైతులకు షాక్.. యూరియా కొరతపై తెలంగాణ మంత్రి సంచలన వ్యాఖ్యలు..
ఈ మొత్తం వ్యవహారంలో మ్యాచ్ రెఫరీ ఆండీ పైక్రాఫ్ట్ జోక్యం చేసుకుని, సల్మాన్‌ను భారత కెప్టెన్‌తో కరచాలనం చేయవద్దని సలహా ఇచ్చారని.. అంతేకాకుండా, మ్యాచ్‌కు ముందు జరిగే జట్టు షీట్ల మార్పిడిని కూడా అడ్డుకున్నారని PCB ఆరోపించింది. ఇది నిబంధనలకు విరుద్ధమని, పక్షపాతంగా వ్యవహరించారని పేర్కొంటూ PCB పైక్రాఫ్ట్‌పై ఐసీసీకి ఫిర్యాదు చేసింది. ఇకపోతే పాకిస్తాన్ ఈ మ్యాచ్‌ను బహిష్కరించడం వల్ల సుమారు 16 మిలియన్ డాలర్స్ ఆదాయాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. అంతేకాకుండా క్రమశిక్షణా చర్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది.
ప్రస్తుతం మ్యాచ్ సమయానికి పాకిస్తాన్ జట్టు తమ హోటల్‌లోనే ఉండి, స్టేడియంకు వెళ్లడానికి నిరాకరించింది. ఆటగాళ్లకు తమ గదుల్లోనే ఉండాలని సూచించారు. అయితే, యుఏఈ జట్టు ఇప్పటికే స్టేడియంకు బయలుదేరింది. ఈ మ్యాచ్ ఫలితం ఎలా ఉంటుందనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఈ వివాదం ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది. అయితే పాక్ ఈ ఒక్క మ్యాచ్ ను మాత్రమే బహిష్కరించనుందా లేదా టోర్నీ నుండి నిష్క్రమిస్తుందో ఇంకా అధికారంగా తెలియాల్సి ఉంది.
Honda WN7: అరే.. ఏంది భాయ్.. ఇట్లుంది! మొట్టమొదటి హోండా ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ చూశారా?
