Zakir Ali Anik made bold comments Ahead of Asia Cup 2025: ఆసియా కప్ 2025 సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు యూఏఈ వేదికగా జరగనుంది. భారత్ వద్దే ఆతిథ్య హక్కుల ఉన్నా.. గతంలో పాకిస్థాన్‌తో చేసుకున్న ఒప్పదం కారణంగా తటస్థ వేదికలో టోర్నీ జరగనుంది. సెప్టెంబర్ 9న అఫ్గానిస్థాన్, హాంకాంగ్ పోరుతో ట్రోఫీ ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 11న బంగ్లాదేశ్ తన మొదటి మ్యాచును హాంకాంగ్‌తో తలపడనుంది. టోర్నీ కోసం 20 మంది ఆటగాళ్లతో కూడిన ప్రిలిమినరీ జట్టును బీసీబీ ప్రకటించింది. మొదటి టైటిల్ కొట్టాలనే లక్ష్యంతో త్వరలోనే యూఏఈలో ఒక ప్రత్యేక శిబిరాన్ని కూడా ఏర్పాటు చేయనుంది. టోర్నమెంట్‌కు కౌంట్‌డౌన్ మొదలైన నేపథ్యంలో బంగ్లా బ్యాటర్ జకీర్ అలీ అనిక్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. టైటిల్ లక్ష్యంగా తాము బరిలోకి దిగ్గుతున్నామని చెప్పాడు.
బంగ్లాదేశ్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ జాకీర్ అలీ తాజాగా విలేకరులతో మాట్లాడుతూ… ‘డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం సానుకూలంగా ఉంది. ఖచ్చితంగా ఈసారి ఛాంపియన్ అవ్వాలనే లక్ష్యంతో మేము ఆసియా కప్‌కు వెళ్తున్నాము. వ్యక్తిగతంగా నేను టోర్నీ గెలవడానికే వెళ్తున్నా. ఛాంపియన్‌గా నిలుస్తామని డ్రెస్సింగ్ రూమ్‌లోని ప్రతి ఒక్కరూ నమ్మకంగా ఉన్నారు. ప్రతి ఒక్కరూ బాగా శ్రమిస్తున్నారు. మేము ఏ జట్టును తేలికగా తీసుకోము. మా ప్రణాళిక ఎల్లప్పుడూ ఒకేలా ఉంటుంది. మేము మా స్వంత శైలిలో క్రికెట్ ఆడుతాం. ప్రతి జట్టుతోనూ ఒకేలా ఆడతాము. మైదానంలో బాగా రాణించగలిగేలా మేము సిద్ధం అవుతాము. ఈసారి ఆసియా కప్ మాదే అనే నమ్మకం ఉంది’ అని చెప్పాడు.
Also Read: Indian Cricket Team: భారత జట్టు ప్రకటన ఆలస్యం.. బీసీసీఐ కార్యాలయానికి సూర్యకుమార్!
27 ఏళ్ల జాకీర్ అలీ ఇప్పటివరకు 33 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 571 పరుగులు చేశాడు. అతని సగటు 27.19గా ఉండగా.. అత్యధిక స్కోరు 72 నాటౌట్. శ్రీలంక, హాంకాంగ్, ఒమన్‌లతో పాటు బంగ్లాదేశ్ గ్రూప్ బీలో ఉంది. సెప్టెంబర్ 9న అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో హాంకాంగ్‌తో బంగ్లాదేశ్ టైటిల్ వేటను ప్రారంభిస్తుంది. కెప్టెన్ లిట్టన్ దాస్ నాయకత్వంలో బంగ్లా బరిలోకి దిగనుంది. తాజాగా శ్రీలంక, పాకిస్థాన్‌లతో జరిగిన టీ20 సిరీస్‌లు గెలిచి మంచి ఫామ్‌లో ఉంది. టోర్నీలో గ్రూప్ స్టేజ్, సూపర్ 4 అనంతరం ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
