Asia Cup 2023 Schedule and Timing: ఆసియా క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆసియా కప్ 2023 షెడ్యూల్ రిలీజ్ అయింది. ఆగష్టు 30 నుంచి సెప్టెంబర్ 17 వరకు టోర్నీ జరగనుంది. సెప్టెంబర్ 2న చిరకాల ప్రత్యర్థులు భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే ఈ షెడ్యూల్‌ను అటు పీసీబీ కానీ.. ఇటు ఏసీసీ కానీ అధికారికంగా వెల్లడించలేదు. ఆసియా కప్ 2023 వన్డే టోర్నీకి అధికారిక బ్రాడ్‌కాస్టర్ అయిన స్టార్ స్పోర్ట్స్ ఈ షెడ్యూల్‌ను రిలీజ్ చేసినట్టు ఓ క్రికెట్ అనలిస్ట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.
ఆసియా కప్ 2023 ఆగష్టు 30న పాకిస్తాన్, నేపాల్ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌తో ఆరంభం కానుంది. సెప్టెంబర్ 2న భారత్, పాకిస్తాన్ మ్యాచ్ ఉంది. ఆసియా కప్ 2023లోని అన్ని మ్యాచ్‌లు మధ్యాహ్నం 3 గంటలకు ఆరంభం అవుతాయి. అయితే వేదికలు మాత్రం ఇంకా ప్రకటించలేదు. ఈ నెల 30న ఆసియా కప్ ప్రారంభమవుతుందనే విషయాన్ని తెలియజేస్తూ.. శనివారం స్టార్ స్పోర్ట్స్ తమ సోషల్ మీడియా ఖాతాల్లో ఓ పోస్టర్‌ను పంచుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు షెడ్యూల్‌ను కూడా రిలీజ్ చేసిందంటే.. దాదాపుగా ఇదే ఫైనల్ అయినట్టు. అధికారిక ప్రకటన త్వరలోనే రానుందని సమాచారం.
Also Read: Actress Sindhu Dies: ఆస్పత్రి ఖర్చులకు డబ్బులేక.. ప్రాణాలు విడిచిన నటి!
నిజానికి ఆసియా కప్ 2023కు పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వాలి. అయితే పాక్‌లో పర్యటించేందుకు భారత్ సుముఖత వ్యక్తం చేయకపోవడంతో తటస్థ వేదికపై మ్యాచ్‌లు జరుగనున్నాయి. హైబ్రీడ్ మోడల్‌లో జరగనున్న ఆసియా కప్ 2023లో మొత్తం 13 మ్యాచ్‌లు ఉన్నాయి. ఈ 13 మ్యాచ్‌లకు పాకిస్తాన్, శ్రీలంక ఆతిథ్యం ఇవ్వనున్నాయి. పాక్‌లో 4, శ్రీలంకలో 9 మ్యాచ్‌లు జరగనున్నాయి. పాక్‌లో నాలుగు మ్యాచ్‌ల అనంతరం.. టోర్నీ శ్రీలంకకు తరలిపోతోంది. శ్రీలంకలోనే భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ఉంటుంది. భారత్, శ్రీలంక, పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘానిస్తాన్, నేపాల్ జట్లు ఈ టోర్నీలో తలపడనున్నాయి.
Asia Cup schedule & timing by Star Sports.
Save your dates for epic clashes…!!!! pic.twitter.com/5Zl1wH90tB
— Johns. (@CricCrazyJohns) August 7, 2023