IND vs NEP Playing 11: ఆసియా కప్ 2023లో భారత్ మరో కీలక మ్యాచ్‌కు సిద్ధమైంది. పసికూన నేపాల్‌తో రోహిత్ సేన తలపడనుంది. విజయంతో టోర్నీలో శుభారంభం చేయడమే కాకుండా.. గ్రూప్-ఏలో సూపర్-4 బెర్తు దక్కించుకోవాలన్న పట్టుదలతో టీమిండియా ఉంది. అయితే ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉంది. ఒకవేళ వర్షం కారణంగా భారత్, నేపాల్ మ్యాచ్ రద్దయినా.. 2 పాయింట్లతో టీమిండియా ముందంజ వేస్తుంది. ఎందుకంటే ఇప్పటికే పాకిస్తాన్ చేతిలో నేపాల్ ఓటమి పాలైంది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
పాకిస్థాన్ మ్యాచ్‌లో భారత్ టాప్ ఆర్డర్ బ్యాటింగ్ సజావుగా సాగలేదు. పాక్‌పై విఫలమైన కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ భారీ ఇన్నింగ్స్ ఆడాలని మేనేజ్మెంట్ ఆశిస్తోంది. తరచుగా విఫలమవుతున్న ఓపెనర్ శుభ్‌మన్ గిల్ కూడా ఫామ్ అందుకోవడానికి ఇదే మంచి అవకాశం. గాయం నుంచి కోలుకుని పునరాగమంలో విఫలమైన శ్రేయస్ అయ్యర్ కూడా పరుగులు చేసేందుకు నేపాల్ మ్యాచ్ ఉపదయోగపడనుంది. పాక్‌పై అద్భుతంగా ఆడిన ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యాలపై అంచనాలు పెరిగాయి. ప్రపంచకప్ 2023 ఉన్న నేపథ్యంలో అందరూ రన్స్ చేస్తే జట్టులో ఆత్మవిశ్వాసం పెరగనుంది.
పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో వర్షం కారణంగా బౌలింగ్ చేసే ఛాన్స్ భారత బౌలర్లు దక్కలేదు. దాంతో నేపాల్‌పై ఎలా రాణిస్తారో చూడాలి. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా వ్యక్తిగత కారణాలతో ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. బుమ్రా స్థానంలో సీనియర్ పేసర్ మహ్మద్ షమీ తుది జట్టులోకి రానున్నాడు. షమీ, మొహ్మద్ సిరాజ్ బౌలింగ్‌ను అడ్డుకోవడం నేపాల్ బ్యాటర్లకు కష్టమే. మరోవైపు ఫామ్‌లో ఉన్న మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ చెలరేగితే నేపాల్‌కు ఇబ్బందులు తప్పవు. ఇక ఐపీఎల్‌లో ఆడిన స్పిన్నర్ సందీప్ లమిచానె నేపాల్ జట్టులో మంచి ఆటగాడు. కెప్టెన్ రోహిత్ పౌడెల్, కుశాల్ బర్తెల్ కూడా మంచి బ్యాటర్లు. వీరు భారత్‌ను ఏమాత్రం ప్రతిఘటిస్తారో చూడాలి.
Also Read: Warangal: పోలీసుల ముందే బైక్‌కు నిప్పు పెట్టిన వ్యక్తి.. కారణం ఏంటంటే?
తుది జట్లు (అంచనా):
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, మొహ్మద్ షమీ, మొమ్మద్ సిరాజ్.
నేపాల్: రోహిత్ పౌడెల్ (కెప్టెన్), కుశాల్ బర్టెల్, అసిఫ్ షేక్, అరిఫ్ షేక్, సోమ్‌పాల్, దీపేంద్ర సింగ్, గుల్షాన్ జా, కుశాల్ మల్లా, కరణ్, సందీప్ లమిచానె, లలిత్ రాజ్‌బాన్షీ.