Site icon NTV Telugu

Hyderabad: ఉప్పల్ లో ASIకి మాంజా తగిలి మెడకు తీవ్ర గాయాలు..

Manja

Manja

చైనా మాంజా ప్రమాదాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. పలువురు వ్యక్తులు మాంజా కారణంగా తీవ్రగాయాలపాలవుతుండగా.. మరికొందరు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా ఉప్పల్ లో ఏఎస్ఐకి మాంజా తగిలి మెడకు తీవ్ర గాయాలు అయ్యాయి. నల్లకుంట పీఎస్ లో విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ నాగరాజు మెడకు మాంజా చుట్టుకోవడంతో గాయపడ్డారు. ఎగ్జిబిషన్ డ్యూటీ కోసం ఉప్పల్‌లోని తన ఇంటి నుంచి బయలుదేరిన సమయంలో ఈ ఘటన జరిగింది. ఉప్పల్ PS పరిధిలోని సౌత్ స్వరూప్ నగర్ వద్ద సాయంత్రం మాంజా ఆయన మెడకు చుట్టుకుని గొంతుకు తీవ్ర గాయామైంది. వెంటనే ఆయనను ఎల్బీనగర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

Also Read:IAF Agniveer Vayu Recruitment 2027: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ వాయు పోస్టులు.. అర్హతతో సహా పూర్తి వివరాలు ఇవే

మరో ఘటనలో.. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది.
అల్మాస్‌గూడ ప్రధాన రహదారిపై రోడ్డుప్రక్కన నడుచుకుంటూ వెళ్తున్న యాదమ్మ (వయసు సుమారు 70 సంవత్సరాలు) అనే వృద్ధ మహిళకు అకస్మాత్తుగా చైనా మాంజా కాలికి చుట్టుకుంది.
ఈ ఘటనలో ఆమె కాలు తీవ్రంగా కోసుకుపోయి భారీగా రక్తస్రావం అయ్యింది. ఘటనను గమనించిన స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వృద్ధురాలిని సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

Exit mobile version