కొన్ని రోజుల క్రితం ఎయిర్ లైన్స్ మాదిరిగా రైల్వేలలో కూడా అదనపు లగేజీకి ఛార్జీలు వసూలు చేస్తారనే ప్రచారం జోరుగా సాగింది. ఫస్ట్ క్లాస్ AC కోచ్‌లలో ప్రయాణించే వారు 70 కిలోల వరకు లగేజీని తీసుకెళ్లడానికి అనుమతి ఉందని, ఏసీ సెకండ్ క్లాస్ ప్రయాణీకులకు, ఈ పరిమితి 50 కిలోలు, థర్డ్ ఏసీ స్లీపర్ క్లాస్ ప్రయాణీకులకు, పరిమితి 40 కిలోల వరకు ఉంటుంది. అదేవిధంగా, జనరల్ టిక్కెట్లపై ప్రయాణించే ప్రయాణీకులు తమతో 35 కిలోల లగేజీని మాత్రమే తీసుకెళ్లడానికి అనుమతిస్తారని నివేదికలు పేర్కొన్నాయి. విమానాశ్రయాల మాదిరిగానే, రైల్వే స్టేషన్లలో లగేజీని ముందస్తుగా బుక్ చేసుకునే సౌకర్యం ప్రారంభించబడిందని మునుపటి నివేదికలు కూడా పేర్కొన్నాయి.
Also Read:Russia Ukraine war: యుద్ధం ముగింపు ఉత్తుత్తి మాటలేనా?.. ఉక్రెయిన్‌పై విరుచుకుపడిన రష్యా
బ్యాగ్ లేదా బ్రీఫ్‌కేస్ నిర్దేశించిన పరిమితి కంటే ఎక్కువ బరువు ఉంటే, అటువంటి ప్రయాణీకులపై జరిమానా విధించే నిబంధన ఉందంటు టాక్ వినిపించింది. ఈ నియమాన్ని అమలు చేయడానికి రైల్వే స్టేషన్లలో ఎలక్ట్రానిక్ లగేజీ యంత్రాలను కూడా ఏర్పాటు చేయనున్నట్లు ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో దీనిపై రైల్వే మంత్రి క్లారిటీ ఇచ్చారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, రైల్వేలలో అదనపు లగేజీకి ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తున్నారనే వార్తలను ఖండించారు. దశాబ్దాలుగా ఒక ప్రయాణీకుడు తనతో ఎంత బరువును తీసుకెళ్లవచ్చనే నియమం ఉందని, తాజాగా కొత్త నియమం ఏదీ రూపొందించలేదని ఆయన స్పష్టం చేశారు.
