NTV Telugu Site icon

Viral Video: కేఎస్ భరత్తో అశ్విన్ రచ్చ.. తెలుగు నేర్పించాలంటూ ఓ పట్టుపట్టాడు.. వీడియో తెగ వైరల్

Ashwin

Ashwin

Viral Video: ఐపీఎల్ ఫీవర్ ముగిసింది. ఇక రేపటి (జూన్ 7) నుంచి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ప్రారంభం కానుంది. లండన్ లోని ఓవల్ లో ఆస్ట్రేలియాతో తలపడేందుకు టీమిండియా సిద్ధంగా ఉంది. 2021 లో కివీస్ తో చేయిజార్చుకున్న భారత్.. ఈ సారైనా ఛాంపియన్ షిప్ ట్రోపీని సొంతం చేసుకోవాలని చూస్తుంది. అందుకోసం టీమిండియా ఆటగాళ్లు లండన్ కు చేరుకున్నారు. అయితే భారత క్రికెటర్స్ కొందరు ప్రాక్టీస్ స్టాట్ చేస్తే.. మరికొందరు ఫన్నీ వీడియోలు చేస్తున్నారు.

Read Also: Adipurush: వైట్ లో రామయ్య.. బ్లాక్ లో సీతమ్మ.. చూడడానికి రెండు కళ్ళు సరిపోవడం లేదే

రవిచంద్రన్ అశ్విన్, వికెట్ కీపర్ కం బ్యాట్స్ మెన్ కేఎస్ భరత్ ల వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ చేస్తోంది. మాములుగా ఐతే క్రికెటర్స్ సోషల్ మీడియాను ఎక్కువగానే ఫాలో అవుతుంటారు. వారి ఫోటోస్, వీడియోస్ పెట్టడం లాంటివి చేస్తూంటారు. కానీ లండన్ లో టీమిండియా ఫోటోషూట్ సందర్భంగా.. అశ్విన్, భరత్ల ఓ ఫన్నీ వీడియో బయటకు వచ్చింది. వీడియోలో, అశ్విన్ ఫుల్ జోవియల్ మూడ్‌లో కనిపించాడు. భరత్‌ని తనకు తెలుగు భాష నేర్పించమని అడిగినట్లు వీడియోలో చూడొచ్చు. వీడియో ప్రారంభంలో, భరత్ తన సహచరుడు అశ్విన్‌ను స్వాగతించాడు. ఆ తర్వాత భరత్‌ని ఫొటోషూట్ అంటే భయపడుతున్నావా అని అశ్విన్ అడిగాడు. అంతా మంచిగానే ఉందని అనుకుంటున్నావా? అని అడిగాడు. దీనికి భరత్, ‘నేను భయపడడం లేదని, నిజంగా సవాలు కోసం ఎదురు చూస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు. ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ తెలుగు అభిమానులకు ఒక సందేశాన్ని అందించమని భరత్‌ని కోరాడు.

Read Also: Adipurush Pre Release Event Live Updates : ప్రభాస్‌ ఫ్యాన్స్‌తో కిక్కిరిసిన తారకరామ స్టేడియం

అంతేకాకుండా కేఎస్ భరత్ టీమిండియా అభిమానులందరినీ జట్టుకు మద్దతు ఇవ్వాలని కోరాడు. ట్రోఫీని భారతదేశానికి తిరిగి తీసుకువస్తామని చెప్పుకొచ్చాడు. అశ్విన్ తనకు తెలుగులో ఏదైనా నేర్పించమని భరత్‌ని అడిగాడు. ఈ మేరకు భరత్ తెలుగులో కొన్ని వాఖ్యాలు చెప్పాడు. వాటిని అశ్విన్ పలికాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.