NTV Telugu Site icon

Ashu reddy: డ్రగ్స్ కేసులో అషురెడ్డి.. వందల ఫోన్ కాల్స్.. అవకాశాలు లేకున్నా లగ్జరీ లైఫ్ అందుకేనా?

Ashu Reddy Phone Calls

Ashu Reddy Phone Calls

Ashu reddy name in kp chowdary drugs case: 2017లో నమోదైన టాలీవుడ్ డ్రగ్స్ కేసు తెలుగు సినీ పరిశ్రమ మొత్తాన్ని ఒక కుదుపు కుదిపేసింది. తెలుగు సినీ పరిశ్రమ అంతా డ్రగ్స్ మయం అన్నట్టుగా మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం మొదలైంది. అయితే ఎట్టకేలకు ఎక్సైజ్ శాఖ క్లీన్ చీట్ ఇవ్వడంతో ఆ విషయం కొంత మరుగున పడింది. అయితే తాజాగా కబాలి చిత్రం నిర్మాత కె.పి చౌదరి అలియాస్ కృష్ణ ప్రసాద్ చౌదరి డ్రగ్స్ అమ్ముతూ పోలీసులకు పట్టు పడడంతో అతని అరెస్ట్ చేశారు. ప్రస్తుతానికి పోలీసులు తమ కస్టడీలో అతని విచారిస్తున్నారు. ఈ విచారణలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా అతని కస్టడీ రిపోర్ట్ లో పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు అతను బుల్లితెర భామ అషు రెడ్డితో వందల ఫోన్ కాల్స్ మాట్లాడినట్లుగా గుర్తించారు. అషు రెడ్డి సోషల్ మీడియాలో జూనియర్ సమంతగా పాపులారిటీ దక్కించుకొని నెమ్మదిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.
KP Chowdary Case: కేపీ చౌదరి కస్టడీ రిపోర్ట్‌లో సంచనాలు.. మళ్ళీ తెర మీదకు టాలీవుడ్ డ్రగ్స్ కేసు!
ముందుగా డబ్స్మాష్ ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకున్న ఆమె ఆ తరువాత నితిన్ హీరోగా నటించిన చల్ మోహన్ రంగా సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసింది. తర్వాత బుల్లితెరకి పరిమితమైన ఆమె బిగ్ బాస్ లో అవకాశం ఎక్కించుకుని మరింత క్రేజ్ సంపాదించింది. ఇప్పుడు అడపాదడపా సినిమాలు వెబ్ సిరీస్ లు పలు షోస్ చేస్తూ ఆమె టైం పాస్ చేస్తోంది. అయితే పెద్దగా అవకాశాలు లేకపోయినా సరే ఆమె మాత్రం లగ్జరీ లైఫ్ గడుపుతూ ఉంటుంది. ఈరోజు దుబాయిలో కనిపించిన ఆమె రేపు అమెరికాలో కనిపిస్తుంది, ఆ తర్వాత రోజు మరో దేశంలో కనిపిస్తుంది. అవకాశాలు లేకపోయినా ఆమె డ్రగ్స్ అమ్మడం వల్లే అంత లగ్జరీ లైఫ్ అనుభవిస్తుందా అనే అనుమానాలు కూడా పోలీసులలో తలెత్తుతున్నాయి. వందల ఫోన్లు కృష్ణ ప్రసాద్ చౌదరితో మాట్లాడడంతో అషు రెడ్డికి ఈ డ్రగ్స్ అమ్మకం గ్యాంగ్ తో ఏమైనా పరిచయాలు ఉన్నాయా? అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఆ కోణంలో కూడా ప్రస్తుతానికి దర్యాప్తు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఆధారాలు గనక దొరికితే ఆమెను కూడా ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నారు.

Show comments