Site icon NTV Telugu

Devaki Nandana Vasudeva: అశోక్ గల్లా కొత్త సినిమా.. ట్రైలర్ ఎలా ఉందంటే?

Devaki Nandana Vasudeva Trailer

Devaki Nandana Vasudeva Trailer

‘సూప‌ర్ స్టార్’ మ‌హేశ్ బాబు మేనల్లుడు అశోక్‌ గల్లా హీరో న‌టిస్తున్న రెండవ చిత్రం ‘దేవకీ నందన వాసుదేవ’. ‘గుణ 369’ ఫేం అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని నల్లపనేని యామిని సమర్పణలో లలితాంబిక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సోమినేని బాలకృష్ణ నిర్మిస్తున్నారు. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ స్టోరీ అందించిన ఈ చిత్రం న‌వంబ‌ర్ 22న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర యూనిట్ ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్రమాల్లో వేగం పెంచింది.

దేవకీ నందన వాసుదేవ ట్రైలర్‌ని నేడు చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. 2 నిమిషాల 35 సెకండ్ల నిడివి గల ఈ ట్రైలర్‌.. ‘ఈ భూమి మీద ఎక్క‌డా లేని విధంగా సుద‌ర్శ‌న చ‌క్రంతో వాసుదేవుడి విగ్ర‌హం ఉంది’ అనే డైలాగ్‌తో ప్రారంభ‌మైంది. ‘ఈ ఒక్క సంవత్సరం జాగ్రత్తగా ఉండు నాన్న.. జాతకంలో ఏదో ఇబ్బంది ఉందట’, ‘నీ మరణగండం నీ ఇంటనే పుడుతుంది’, ‘చావు దగ్గరికి వెళ్లకు, అది నీ దగ్గరికి వచ్చేదాక వెయిట్ చెయ్’ అనే డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. ట్రైలర్‌లో యాక్ష‌న్ స‌న్నివేశాలు బాగున్నాయి. కృష్ణుడి స్టోరీ పాయింట్ ఈ సినిమాకు ఏ మేరకు హెల్ప్ అవుతుందో చూడాలి.

Also Read: Bhairavam: ‘గజపతి’గా మంచు మనోజ్‌.. ఫస్ట్‌ లుక్ పోస్టర్ వైరల్!

దేవకీ నందన వాసుదేవలో తెలంగాణకు చెందిన మోడల్ మానస వారణాసి క‌థానాయిక‌గా నటిస్తున్నారు. ఆదిపురుష్ చిత్రంలో హనుమంతుడిగా చేసిన దేవదత్తా.. ఇందులో విలన్‌గా చేశాడు. నిజానికి నవంబర్ 14నే ఈ చిత్రం రిలీజ్ కావాలి. మట్కా, కంగువ రిలీజ్ కారణంగా న‌వంబ‌ర్ 22కు పోస్ట్ ఫోన్ అయింది. ఇక హీరో’ సినిమాతో అశోక్ గల్లా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ మూవీ పెద్దగా ఆడలేదు. దాంతో దేవకీ నందన వాసుదేవపై భారీ ఆశలు పెట్టుకున్నాడు.

Exit mobile version