తెలంగాణలో రోజురోజుకీ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరుగుతోంది అని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చౌహాన్ అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాహుల్ కాళేశ్వరం సందర్శన వెళ్లిన తర్వాత అనేక నిజాలు బయటపడుతున్నాయి.. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి ఏటీఏం లాగా ఉపయోగపడుతోంది అని ఆరోపించారు. కమిషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్ట్ అంచనాలను పెంచారు అని మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చౌహాన్ మండిపడ్డారు.
Read Also: Rajasthan: ఎన్నికల ముందు కాంగ్రెస్ చీఫ్ కుమారుడికి ఈడీ సమన్లు..
కాంగ్రెస్ మొదలు పెట్టిన అంబేద్కర్ సుజల స్రవంతి ప్రాజెక్టును బీఆర్ఎస్ కాళేశ్వరంగా మార్చింది అని మాజీ సీఎం అశోక్ చౌహాన్ అన్నారు.
కాళేశ్వరం పేరు చెప్పుకొని బీఆర్ఎస్ ఓట్లు దండుకుంది.. కాళేశ్వరం పై విమర్శలు చేస్తున్న బీజేపీ ఎలాంటి విచారణ చేయడం లేదు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్లో లోపాలు ఉన్నాయి.. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం వృధా చేసిన సొమ్ము తెలంగాణ ప్రజలపై అప్పుగా మారింది.. కాళేశ్వరం డబ్బులు ఎక్కడ పోయాయి.. రైతుల కోసం నీళ్ళు ఇవ్వడానికి అని చెప్తూ అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తున్నారు.. తెలంగాణలో మేం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను తప్పకుండా అమలు చేస్తాం.. ఇచ్చిన మాటని నిలబెట్టుకునే ట్రాక్ రికార్డ్ కాంగ్రెస్ పార్టీకి ఉంది అని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చౌహాన్ పేర్కొన్నారు.