Site icon NTV Telugu

Amigos Movie Update : చూపులతో వల వేస్తున్న ‘అమిగోస్’ బ్యూటీ

Ashika Ranganath As Ishika In Kalyan Ram Amigos

Ashika Ranganath As Ishika In Kalyan Ram Amigos

Amigos Movie Update : బింబిసార వంటి బ్లాక్ బస్టర్ మూవీ అందుకున్న కల్యాణ్ రామ్ మరో విభిన్న కథనంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో అమిగోస్ అనే చిత్రంలో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి, రాజేంద్రరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాతో కథానాయికగా తెలుగు తెరకి ఆషిక రంగనాథ్ పరిచయమవుతోంది. ‘ఇషిక’ అనే పాత్రతో ఆమె ప్రేక్షకులను పలకరించనుంది. ఇషిక పాత్రను పరిచయం చేస్తూ ఆషిక పోస్టర్ ను వదిలారు. ఈ పోస్టర్ లో ఆమె మరింత గ్లామరస్ గా కనిపిస్తోంది.

ఆషిక రంగనాథ్ కన్నడ బ్యూటీ. 2016లోనే కన్నడ సినిమాతో ఆమె ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి వరుస సినిమాలు చేస్తూ వెళుతోంది. ‘అమిగోస్’ తెలుగులో ఆమె చేస్తున్న మొదటి సినిమా. ఈ సుందరి రూపురేఖలు చూస్తుంటే మాత్రం, టాలీవుడ్లోని యంగ్ హీరోయిన్స్ కి గట్టిపోటీనే ఇచ్చేట్టుగా కనిపిస్తోంది. ‘అమిగోస్’ టైటిల్ స్పానిష్ వర్డ్. మన స్నేహితుని గురించి చెప్పడానికి సూహించే పదం. దాన్ని టైటిల్‌గా పెట్టడం వెనుక ఉన్న కారణం ఏంటి? అనే క్యూరియాసిటీ ప్రేక్షకులు అందరిలో ఉంది.

Exit mobile version