NTV Telugu Site icon

Asani Cyclone: ఏపీకి అలెర్ట్.. తీరం వైపు దూసుకొస్తున్న తుఫాన్

Cyclone Asani

Cyclone Asani

‘అసని’ తీవ్ర తుఫాన్ తీరం వైపు దూసుకొస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ క్రమంగా తీరాన్ని సమీపిస్తోంది. కాకినాడ తీరం వద్ద తుఫాన్ తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. యానాం-కాకినాడ తీరాన్ని తాకిన తర్వాత మళ్లీ తుఫాన్ సముద్రంలోకి వెళ్లనుంది అసని తుఫాన్. దీంతో ఏపీలో రెడ్ అలెర్ట్ జారీ చేసింది ఐఎండీ. ప్రస్తుతం కాకినాడకు 180 కిలోమీటర్ల దూరంలో ఉంది. ముందుగా అసని తుఫాన్ గమనాన్ని బట్టి ముందుగా అది ఏపీ తీరాన్ని తాకదని అనుకున్నప్పటికీ… మళ్లీ దిశ మార్చుకుని కాకినాడ తీరం వైపు పయణిస్తోంది.

తీవ్ర తుఫాన్ కాకినాడ తీరాన్ని తాకననున్న అసని తుఫాన్… తీరం వెంబడి విశాఖ వైపు పయణించే అవకాశం ఉందని తెలుస్తోంది.  ఆతర్వాత ఉత్తరం-ఈశాన్య దిశగా కదులుతూ మచిలీపట్నం, నర్సాపూరం, యానాం, కాకినాడ, తుని, విశాఖపట్నం తీరాల వెంబడి కదులుతూ సాయంత్రానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి చేరుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. తుఫాన్ ప్రభావం వల్ల కాకినాడ, గంగవరం, భీముని పట్నం పోర్టులకు 10 వనెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మిగతా పోర్టులకు ఎనిమిదో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. విశాఖ, తూర్పు గోదావరి, కృష్ణ, పశ్చిమ గోదావరి, గుంటూర్ జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేశారు. తుఫాన్ ప్రభావం తగ్గి రేపటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. విశాఖ మీదుగా వెళ్లే రైళ్లను రద్దు చేయడంతో పాలు, విశాఖకు వచ్చే విమానాలను రద్దు చేశారు.

తుఫాన్ వల్ల ఏపీతో పాటు ఒడిశా, తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. తుఫాన్ నేపథ్యంలో ఏపీ సర్కార్ అలెర్ట్ అయింది. స్టేట్ ఎమర్జెన్సీ సెంటర్ 24 గంటలు పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం 6 ఎన్డీఆర్ఎఫ్, 9 ఎస్డీఆర్ఎఫ్ టీములను సిద్ధం చేశారు.