బహ్రైచ్ ఎన్‌కౌంటర్‌పై ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ పెద్ద ప్రకటన చేశారు. రాజ్యాంగాన్ని ముక్కలు చేస్తున్నారని అన్నారు. నాక్ డౌన్ విధానం రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఎన్‌కౌంటర్ చేసిన వారిని ఒలింపిక్స్‌కు పంపపాలని యూపీ సీఎం యోగి ఆధిత్యానాథ్ ని దృష్టిలో ఉంచుకుని అన్నారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ యూపీని రాజ్యాంగం ప్రకారం నడపాలని కూడా ఒవైసీ సూచించారు.
READ MORE: Maoists : దండకారణ్యంలో మావోయిస్టు వారోత్సవాలు
బహ్రైచ్ హింసాకాండ నిందితులకు పోలీసులతో జరిగిన ఎన్‌కౌంటర్‌పై నిజం తెలుసుకోవడం కష్టం కాదని ఒవైసీ అన్నారు. యోగిజీ ‘థోక్ డెంగే’ విధానం గురించి అందరికీ తెలుసు. పోలీసుల వద్ద ఇంత సాక్ష్యాధారాలు ఉంటే నిందితులకు చట్టపరంగా శిక్ష పడేలా ప్రయత్నాలు జరిగేవి. గత కొన్నేళ్లుగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అనుసరిస్తున్న ‘థోక్ దో’ విధానానికి ఇదో ఉదాహరణ. ఈ విధానం రాజ్యాంగ విరుద్ధమని బీజేపీ, ప్రధాని మోడీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌లకు పదే పదే చెబుతున్నాం. మీరు యుపీని రాజ్యాంగంతో నడపాలి. తుపాకీలతో కాదు. ఎందుకంటే మీరు ఒక తప్పుని ప్రారంభిస్తే ఆ తప్పులు అలాగే కొనసాగుతాయి. ఎవరైనా ఎవరినైనా ఎంచుకొని కాల్చివేస్తారు.” అని తెలిపారు.
ఇలాంటి ఎన్ కౌంటర్లు చేస్తున్న వారిని ఒలింపిక్స్ కు పంపాలని క్రీడా మంత్రికి చెబుతామని ఒవైసీ వ్యంగ్యంగా సమాధానమిచ్చారు. “కనీసం భారత్‌కు బంగారు పతకం తీసుకొస్తారు. ఇదంతా హాస్యాస్పదంగా మారింది. బహ్రైచ్‌లో జరిగిన హింస, దుకాణాలు తగులబెట్టారు. షోరూమ్‌లు తగులబెట్టారు.. మీరు ఇప్పటివరకు ఎంత మందిని అరెస్టు చేశారు. రామ్ గోపాల్ హత్య జరిగింది. ఎవరూ కాదనలేరు.. కానీ ఎవరినైనా కాల్చివేస్తారా?” అని ప్రశ్నించారు.