Site icon NTV Telugu

Asaduddin Owaisi: భారత్‌పై పాక్ ప్రధాని ఫైర్.. ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అదిరిపోయే రిప్లై..!

Asaduddin Owaisi

Asaduddin Owaisi

Asaduddin Owaisi Slams Pakistan PM: ఇస్లామాబాద్‌లో జరిగిన ఇంటర్నేషనల్ యూత్‌ డే సందర్భంగా భారత్‌పై పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్‌ షరీఫ్‌ తీవ్రంగా మండిపడిన విషయం తెలిసిందే. తమకు దక్కాల్సిన ఒక్క చుక్క నీటిని కూడా గుంజుకునేందుకూ భారత్‌కు అవకాశం ఇవ్వబోమన్నారు. నదీ జలాలను నిలిపివేసేందుకు తీసుకునే ఏ చర్య అయినా యుద్ధానికి కవ్వింపుగా భావించాల్సి ఉంటుందని హెచ్చరించారు. తాము సింధూ జలాల కోసం ఎంత వరకైనా పోరాడతామన్నారు. ఈ హెచ్చరికలపై తాజాగా హైదరాబాద్ ఎంపీ, ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. “అర్థంలేని మాటలు మాట్లాడొదంటూ ఫైర్ అయ్యారు.

READ MORE: Odysse Sun: బడ్జెట్‌లో స్టైలిష్ డిజైన్‌, 130 కి.మీ. రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్ చేసిన ఓడిసీ!

మీరు ఖయ్యానికి కాలు దువ్వితే మేము ఏం ఖాళీగా కూర్చొము అన్నట్లుగా రిప్లై ఇచ్చారు ఒవైసీ.. మా వద్ద బ్రహ్మోస్ ఉన్నాయి. పాక్ ప్రధాని ఇలాంటి చెత్తమాటలు మాట్లాడటం మానుకోవాలంటూ హెచ్చరించారు. ఇలాంటి బెదిరింపులు భారత్ విషయంలో ఎంతమాత్రం పనిచేయవని స్పష్టం చేశారు. ఇక చాలు అయ్యిందేదో అయిపోయిందని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. గతంలో పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ‘అణు’ హెచ్చరికలు చేయడాన్ని కూడా ఒవైసీ తిప్పికొట్టారు. భారత్‌ విషయంలో ఆయన మాట్లాడిన మాటలు, వాడిన పదజాలం గర్హనీయమని అన్నారు. అమెరికా వేదిక నుంచి ఆయన ఈ మాటలు మాట్లాడటం దురదృష్టకరమన్నారు.

READ MORE: Viral Video: జోరు వానలో చెరువు మధ్యలోకి వెళ్లి విద్యుత్ పునరుద్ధరణ.. హాట్సాఫ్ లైన్‌మ్యాన్! వీడియో వైరల్

Exit mobile version