NTV Telugu Site icon

Asaduddin Owaisi: రామమందిరంపై అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు..

Asaduddin Owaisi

Asaduddin Owaisi

Ram Mandir: ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మసీదుల్లో ముస్లిం యువత ఉండేలా చూడాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మసీదులను కూడా తమ నుంచి తీసేసుకునే ఛాన్స్ ఉందన్నారు. ఇటీవల నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఒవైసీ ఈ కామెంట్స్ చేశారు. బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం చర్యలపై ముస్లింలు అలర్ట్ ఉండాలని అసదుద్దీన్ సూచించారు. అయోధ్య రామమందిర ప్రస్తావనను కూడా తీసుకొచ్చారు.

Read Also: Raj Kumar Hirani: రామ్ చరణ్ తో సినిమా చేయాలని ఉంది కానీ…

బాబ్రీ మసీదు గురించి అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. గత 500 ఏళ్లుగా ఖురాన్ పఠనం జరిగిన ప్రాంతం తమది కాకుండా పోయింది అని అన్నారు. మూడు నాలుగు మసీదుల విషయంలో జరుగుతున్న కుట్ర మీకు కనిపించట్లేదా?.. ఢిల్లీలోని సునెహ్రీ మసీదు కూడా ఈ జాబితాలో ఉంది అని ఆరోపించారు. చాలా ఏళ్ల పాటు కష్టపడి మనం ఈ స్థాయికి చేరుకున్నామనే ఇలాంటి విషయాలపై మీరు దృష్టి సారించాలి అని ఓవైసీ పేర్కొన్నారు. ముస్లింలు అందరూ ఐకమత్యంతో ఉండాలి.. మరి కొన్ని రోజుల్లో అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం ఉన్న నేపథ్యంలో అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Read Also: Komuravelli Mallanna: 7న మల్లన్న కల్యాణం.. రెండు రోజుల పాటు పెండ్లి వేడుకలు..!

మన మసీదులు మన నుంచి దూరం చేయాలనే కుట్ర జరుగుతుంది అని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు. మసీదులను ఎలా కాపాడాలో నేటి యువత జాగ్రత్తగా ఆలోచిస్తారని ఆశిస్తున్నాను అని ఆయన అన్నారు. మదర్సాలను కాపాడాలని ఒవైసీ కూడా విజ్ఞప్తి చేశారు. మన ఉలేమాలు వారి అంత్యక్రియలు జరిగినా ప్రజలు ఇస్లాం స్వీకరించే విధంగా ఉండేవారన్నారు. ప్రమాదం ఏ విధంగా వస్తుందో చెప్పలేం.. అందరూ చనిపోతారు కానీ మరణానంతరం ఏం సమాధానం చెబుతారు? అంటూ ముస్లిం యువతను ఉసిగొల్పుతూ.. మరణానంతరం అల్లాకు ఏ ముఖం చూపిస్తారో గుర్తుంచుకోవాలని అసదుద్దీన్ ఓవైసీ పేర్కొన్నారు.