Site icon NTV Telugu

Congress: కాంగ్రెస్కు బిగ్ షాక్.. ఢిల్లీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు లవ్లీ రాజీనామా

Congress

Congress

లోక్‌సభ ఎన్నికలకు ముందు ఢిల్లీలో కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అరవిందర్ సింగ్ లవ్లీ తన పదవికి రాజీనామా చేశారు. ఢిల్లీ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఇన్‌ఛార్జ్ దీపక్ బబారియాతో విభేదాల కారణంగా తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు లవ్లీ చెప్పుకొచ్చారు. బాబారియాకు వ్యతిరేకంగా ఉన్న నాయకులను తొలగించాలని తనపై విపరీతమైన ఒత్తిడి తీసుకొచ్చాడు.. కానీ, నేను దానికి ఒప్పుకోకపోవడంతో విభేదాలు కొనసాగయాని అరవింద్ సింగ్ లవ్లి తెలిపారు. అలాగే, బాబరియా నిర్ణయాలు నచ్చకపోవడంతో చాలా మంది కాంగ్రెస్ నేతలు రాజీనామాలు చేస్తున్నారు.

Read Also: Rishabh Pant: దాని వల్ల ప్రతి రోజూ గండమే: రిషబ్ పంత్

అలాగే, అరవింద్ సింగ్ లవ్లీ చాలా కాలంగా కాంగ్రెస్ పార్టీపై కోపంగా ఉన్నాట్లు సమాచారం. దీనికి కారణం ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడమేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఇదే విషయాన్ని అతను తన రాజీనామా లేఖలో రాశాడు. ఇక, గతంలో షీలా ప్రభుత్వంలో 12 ఏళ్ల పాటు మంత్రిగా ఉన్న రాజ్‌కుమార్ చౌహాన్ టికెట్ రాకపోవడంతో కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. నార్త్ ఈస్ట్ ఢిల్లీ సీటు ఆశించిన రాజ్‌కుమార్ చౌహాన్‌కు టికెట్ రాకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ పార్టీకి రిజైన్ చేశారు.

Exit mobile version