Kejriwal: తీహార్ జైలుకు చేరుకున్న సునీతా కేజ్రీవాల్.. మరికాసేపట్లో విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మరికాసేపట్లో తీహార్ జైలు నుంచి విడుదలకానున్నారు. శుక్రవారం దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఇందుకు సంబంధించిన పత్రాలు జైలు అధికారులకు అందాయి. కేజ్రీవాల్‌ను విడుదల చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే కేజ్రీవాల్‌కు స్వాగతం పలికేందుకు సతీమణి సునీతా కేజ్రీవాల్, కుమార్తె తీహార్ జైలుకు చేరుకున్నారు. అలాగే ఆప్ ముఖ్యనేతలు, కార్యకర్తలు జైలుకు తరలివస్తున్నారు.
ఇదిలా ఉంటే శుక్రవారం కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కేవలం లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసమే బెయిల్ ఇచ్చినట్లు న్యాయస్థానం తెలిపింది. బెయిల్ సమయంలో సీఎం కార్యాలయం లేదా సచివాలయానికి వెళ్లేందుకు అనుమతి లేదని సూచించింది. ప్రభుత్వానికి సంబంధించిన ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొనకూడదని స్పష్టం చేసింది. తిరిగి జూన్ 2న సరెండర్ కావాలని సూచించింది.
Also Read
- 2027 World Cup: స్టార్ ప్లేయర్లకు నో ఛాన్స్.. వరల్డ్ కప్ జట్టులో ఊహించని ట్విస్ట్..
- 24 Carat Gold: బంగారం 24 క్యారెట్లే ఎందుకు? 50 లేదా 100 క్యారెట్లు ఎందుకు ఉండవు? 3,000 ఏళ్ల చరిత్ర.. మీకు తెలుసా?
- Sheikh Hasina: విద్యార్థి ఉద్యమం కాదు, రెజిమ్ ఛేంజ్ కుట్ర.. 2 ఏళ్ల తర్వాత మౌనం వీడిన షేక్ హసీనా..
- Air India: ఎయిరిండియా కొత్త సీఈవో, ఎండీగా గెబ్రెమారియం నియామకం
ఇదిలా ఉంటే ఢిల్లీలో ఆరు విడతలో పోలింగ్ జరగనుంది. అనగా మే 25న ఓటింగ్ జరగనుంది. ఎన్నికల ప్రచారం కోసం బెయిల్ ఇవ్వాలని కేజ్రీవాల్ అభ్యర్థించారు. ముఖ్యమంత్రి మనవి అంగీకరించి.. ధర్మాసనం బెయిల్ ఇచ్చింది. జైలు నుంచి రాగానే కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారం చేయొచ్చని తెలుస్తోంది.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం కేజ్రీవాల్‌ను రెండు సార్లు ఈడీ కస్టడీకి అనుమతి ఇచ్చింది. అటు తర్వాత జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో ఏప్రిల్ 1న తీహార్ జైలుకు తరలించారు. దాదాపు 50 రోజుల తర్వాత ఆయనకు విముక్తి లభించింది.
తాజావార్తలు
-
2027 World Cup: స్టార్ ప్లేయర్లకు నో ఛాన్స్.. వరల్డ్ కప్ జట్టులో ఊహించని ట్విస్ట్..
-
Irumudi : అయ్యప్ప ‘బంగారు పల్లకి’ సాంగ్ రెడీ అవుతోంది..!
-
24 Carat Gold: బంగారం 24 క్యారెట్లే ఎందుకు? 50 లేదా 100 క్యారెట్లు ఎందుకు ఉండవు? 3,000 ఏళ్ల చరిత్ర.. మీకు తెలుసా?
-
Sheikh Hasina: విద్యార్థి ఉద్యమం కాదు, రెజిమ్ ఛేంజ్ కుట్ర.. 2 ఏళ్ల తర్వాత మౌనం వీడిన షేక్ హసీనా..
-
Air India: ఎయిరిండియా కొత్త సీఈవో, ఎండీగా గెబ్రెమారియం నియామకం
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!