NTV Telugu Site icon

Sunita Kejriwal: ఎలక్షన్ టైంలో కేజ్రీవాల్‌ గొంతు ప్రజల్లోకి వెళ్లకుండా చేస్తున్నారు..

Sunitha

Sunitha

Sunita Kejriwal: లోక్ సభ ఎన్నికల సమయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ గొంతు ప్రజల్లోకి వెళ్లకుండా జైలులో పెట్టారని ఆయన భార్య సునీతా కేజ్రీవాల్‌ ఆరోపించారు. లిక్కర్ స్కామ్ కేసు ఆరోపణలపై ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ అరెస్టై తీహార్ జైలులో ఉన్నారు. ఈ నేపథ్యంలో సునీతా కేజ్రీవాల్‌ ఆ పార్టీ ఎన్నికల ప్రచార బాధ్యతలు చేపట్టారు.

Read Also: Rajamouli : ఆ విషయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్న రాజమౌళి..?

కాగా, ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థుల తరపున సునీతా కేజ్రీవాల్ రోడ్‌ షోలు, ప్రచార కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా ఇవాళ (గురువారం) గుజరాత్‌ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో ఆప్‌ అభ్యర్థుల తరఫున ఆమె ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన భర్త అరెస్ట్‌పై సునీతా మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో అరవింద్ కేజ్రీవాల్‌ వాయిస్‌ ప్రజల్లోకి వెళ్లకుండా ఈ కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా జైలులో పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి ప్రజలే ఓట్ల ద్వారా తగిన సమాధానం చెబుతారని వెల్లడించారు.

Show comments