Site icon NTV Telugu

Arvind Kejriwal: థ్యాంక్స్ రాహుల్ గాంధీజీ..

Kejriwal

Kejriwal

ఢిల్లీ సర్వీసెస్ బిల్లుకు వ్యతిరేకంగా పార్లమెంటులో ఓటు వేసినందుకు, ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు ఇచ్చినందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కృతజ్ఞతలు తెలిపారు. పార్లమెంటు లోపల, వెలుపల ఢిల్లీ ప్రజల హక్కుల కోసం పోరాడుతున్నందుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నానని కేజ్రీవాల్ లేఖ రాశారు.

Read Also: NTR: సముద్ర వీరుడు స్టైలిష్ అవతారం ఎత్తాడు…

దేశంలో రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్న శక్తులపై పోరాటంలో రాహుల్ గాంధీ నిరంతర మద్దతు కోసం తమ పార్టీ ఎదురు చూస్తోందని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు. జీఎన్సీటీడీ బిల్లును తిరస్కరించడానికి, వ్యతిరేకంగా ఓటు వేయడానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చినందుకు ఢిల్లీలోని 2 కోట్ల మంది ప్రజల తరపున కృతజ్ఞతలు అంటూ చెప్పుకొచ్చారు. కాగా.. ఢిల్లీ సర్కార్ లోని బ్యూరోక్రాట్లపై కేంద్ర ప్రభుత్వానికి నియంత్రణ కల్పించే ఢిల్లీ సర్వీసెస్ బిల్లును పార్లమెంటు సోమవారం ఆమోదించింది. రాజ్యసభలో ఈ బిల్లుకు అనుకూలంగా 131 ఓట్లు రాగా.. వ్యతిరేకంగా 102 ఓట్లు వచ్చాయి.

Read Also: YouTube: యూట్యూట్ లో తప్పుడు వార్తల ప్రసారం.. 8 ఛానళ్లపై కేంద్రం వేటు

దేశ రాజధాని ఢిల్లీలో సమర్థవంతమైన, అవినీతి రహిత పాలన అందించడమే కేంద్ర సర్కార్ లక్ష్యమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. ఆగస్టు 4న లోక్ సభలో వాయిస్ ఓటింగ్ ద్వారా ఈ బిల్లు ఆమోదం పొందింది. ఢిల్లీ ప్రభుత్వంలో అధికారుల బదిలీలు, పోస్టింగ్ ల నిర్వహణపై ఆర్డినెన్స్ స్థానంలో ఈ బిల్లును తీసుకొచ్చింది. కాగా.. ఈ వివాదాస్పద బిల్లు కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ ఏకతాటిపైకి తీసుకు వచ్చింది. ఈ బిల్లును వ్యతిరేకించాలని ఆప్ కాంగ్రెస్ ను కోరింది. ఆప్ అభ్యర్థన మేరకు కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ సర్వీసెస్ బిల్లును వ్యతిరేకించింది. అయితే ఈ బిల్లును నెగ్గించుకోవడంలో మోడీ ప్రభుత్వం సక్సెస్ అయ్యింది.

Exit mobile version