Site icon NTV Telugu

Arvind Kejriwal: తీహార్ జైలుకు సీఎం అరవింద్ కేజ్రీవాల్

Cm

Cm

ఢిల్లీ మద్యం కుంభకోణంలో మనీలాండరింగ్ కేసులో చిక్కుకున్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఈరోజు కోర్టులో హాజరుపరిచింది. అక్కడ నుంచి ఇప్పుడు జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. రౌస్ అవెన్యూ కోర్టు కేజ్రీవాల్‌ను ఏప్రిల్ 15 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.

Read Also: Tillu squre: 100 కోట్ల లక్ష్యంతో దూసుకుపోతున్న టిల్లు.. 3 రోజులకు ఏకంగా..?!

అయితే, కేజ్రీవాల్ విచారణకు సహకరించడం లేదని ఈడీ కోర్టుకు తెలిపింది. కేజ్రీవాల్ అరెస్టు సమయంలో అతని ఫోన్, ఇతర డిజిటల్ పరికరాలను కూడా స్వాధీనం చేసుకున్నాం.. వాటి పాస్‌వర్డ్‌ను చెప్పడం లేదని ఈడీ కోర్టుకు చెప్పింది. ఉద్దేశపూర్వకంగా మమల్ని తప్పుదోవ పట్టిస్తున్నాడు అని ఈడీ అధికారులు అన్నారు. ప్రస్తుతానికి కేజ్రీవాల్‌ను జ్యుడీషియల్ కస్టడీలో ఉంచాలి.. మళ్లీ అవసరమైనప్పుడు అతని రిమాండ్‌ను కోరుతామని ఈడీ తెలిపింది. ఇక, అరవింద్ కేజ్రీవాల్ దాదాపు 10 రోజుల పాటు ఈడీ కస్టడీలో ఉన్నారు. అతడ్ని ప్రతి రోజూ 5 గంటలకు పైగా 50 గంటల పాటు విచారించినట్లు ఈడీ తెలిపింది.

Read Also: Kesineni Nani: ఫ్లైట్స్లో తిరిగే సుజనా చౌదరికి ప్రజల సమస్యలు ఏం తెలుస్తాయి..

ఇక, ఈడీ తరఫు న్యాయవాది ఏఎస్‌జీ రాజు మాట్లాడుతూ.. విజయ్‌ నాయర్‌ కేజ్రీవాల్‌తో సన్నిహితంగా ఉండేవారన్నారు. విజయ్ నాయర్ తనకు రిపోర్టు చేయలేదని కేజ్రీవాల్ విచారణ సందర్భంగా చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి అతీషి పేరు తొలిసారిగా కోర్టుకు వినిపించింది. కోర్టుకు హాజరయ్యేందుకు వచ్చిన కేజ్రీవాల్ మీడియా ప్రతినిధుల ముందు మరోసారి ప్రధాని మోడీని టార్గెట్ చేశారు. ప్రధాని చేస్తున్నది దేశానికి మంచిది కాదన్నారు. రాంలీలా మైదాన్‌లో ప్రతిపక్ష కూటమి చేపట్టిన ర్యాలీపై స్పందించాలని కేజ్రీవాల్‌ను కోరారు. కాగా, ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్టైన మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, విజయ్ నాయర్, సత్యేందర్ జైన్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సైతం తీహార్ జైల్లో ఉన్నారు.

Exit mobile version