Kejriwal: రాహుల్‌ను పీఎంగా అంగీకరిస్తారా? కేజ్రీవాల్ ఏం చెప్పారంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. నువ్వానేనా? అన్నట్టుగా ఇండియా కూటమి-ఎన్డీఏ కూటమి తలపడుతున్నాయి. అధికారం మాదంటే మాదంటూ ఎవరికీ వారే ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే ఐదు దశల పోలింగ్ ముగిసింది. ఇక శనివారం (మే 25) ఆరో దశ పోలింగ్ జరగనుంది.
ఇదిలా ఉంటే తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఇక ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమి గెలిస్తే ప్రధానమంత్రి కావాలనే ఉద్దేశం తనకు లేదని ఆయన తెలిపారు. నియంతృత్వం నుంచి దేశాన్ని కాపాడాలన్నదే తన లక్ష్యమని చెప్పారు. బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే మాత్రం ప్రజాస్వామ్యం పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందని పరోక్షంగా కమలం పార్టీని విమర్శించారు.
Also Read
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- AI Job Fears: 'నా ఉద్యోగం సేఫ్‌నా?'.. ఏఐ వల్ల సగానికి పైగా ఐటీ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన! షాకింగ్ రిపోర్ట్..
- Vaibhav's Friend: 35 ఫోర్లు, 9 సిక్సర్లు, 210 పరుగుల ఇన్నింగ్స్.. వెలుగులోకి మరో వైభవ్ సూర్యవంశీ..
- Virat Kohli-Vaibhav: బరిలోకి విరాట్ కోహ్లీ, వైభవ్ సూర్యవంశీ.. ఓపెనర్లుగా..?
లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమి గెలిస్తే ప్రధానమంత్రి రేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఉంటారా? అలా కాకుండా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అభ్యర్థిత్వాన్ని అంగీకరిస్తారా? ఈ ప్రశ్నలకు అరవింద్ కేజ్రీవాల్ ఓ ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్యూలో ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చారు. ఆప్ ఒక చిన్న పార్టీ అని, కేవలం 22 సీట్లలో పోటీ చేస్తోందని చెప్పారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అభ్యర్థిత్వంపై సమాధానమిస్తూ.. అలాంటి చర్చలేవీ ఇంతవరకూ జరగలేదన్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఇండియా కూటమి దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటుందని సమాధానమిచ్చారు.
దేశ వ్యాప్తంగా ఏడు దశల్లో పోలింగ్ జరుగుతోంది. ఇప్పటికే ఐదు దశల పోలింగ్ ముగిసింది. ఆరో విడత శనివారం జరగనుంది. చివరి విడత జూన్ 1న జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం జూన్ 4న విడుదల కానున్నాయి.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. అనంతరం తీహార్ జైల్లో పెట్టారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. జూన్ 2న తిరిగి సరెండర్ కావాలని ఆదేశించింది.
తాజావార్తలు
-
NBK-Vivek Athreya: బాలకృష్ణ బర్త్ డే వేడుకల్లో వివేక్ ఆత్రేయ – మైత్రీ రవిశంకర్.. వైరల్ ఫోటో వెనుక అసలు కథ ఇదేనా!
-
Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
-
AI Job Fears: ‘నా ఉద్యోగం సేఫ్‌నా?’.. ఏఐ వల్ల సగానికి పైగా ఐటీ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన! షాకింగ్ రిపోర్ట్..
-
Vaibhav’s Friend: 35 ఫోర్లు, 9 సిక్సర్లు, 210 పరుగుల ఇన్నింగ్స్.. వెలుగులోకి మరో వైభవ్ సూర్యవంశీ..
-
Virat Kohli-Vaibhav: బరిలోకి విరాట్ కోహ్లీ, వైభవ్ సూర్యవంశీ.. ఓపెనర్లుగా..?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!