Site icon NTV Telugu

Kejriwal: ఢిల్లీ సీఎం ఇంటికి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు

Arvind Kejriwal

Arvind Kejriwal

Delhi: ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అధికారిక నివాసానికి క్రైమ్ బ్రాంచ్ పోలీసుల బృందం చేరుకుంది. ఆయనకు నోటీసులు ఇచ్చేందుకు వెళ్లారు. నిన్న కూడా క్రైమ్ బ్రాంచ్ బృందం నోటీసు ఇచ్చేందుకు కేజ్రీవాల్ ఇంటికి చేరుకుంది. 7 మంది ఎమ్మెల్యేలను 25 కోట్ల రూపాయలకు బీజేపీ కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిందని ఆయన ఆరోపించిన వాటిపై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నోటీసులు ఇచ్చేందుకు వెళ్లారు.

Read Also: Pragya Jaiswal: జీన్స్ లో టెంప్ట్ చేస్తున్న ప్రగ్య జైస్వాల్…

దీంతో పాటు ఢిల్లీ మంత్రి అతిషికి కూడా విచారణకు హాజరు కావాల్సిందిన ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నోటీసులు జారీ చేయనున్నారు. బీజేపీపై ఆరోపణలు చేస్తూ గత సోమవారం అతిషీ స్వయంగా మీడియాలో వెల్లడించారు. అలాగే, సమయం వచ్చినప్పుడు ఆధారాలు కూడా ఇస్తామని ఆయన చెప్పారు.. అతిషి ఈ మొత్తం వ్యవహారానికి ‘ఆపరేషన్ లోటస్ 2.0’ అని పేరు పెట్టారు.. నిజానికి ఇంతకు ముందు కూడా తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది.. అయితే, దీనికి సంబంధించిన వివరాలతో రావాలని వారికి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు.

Read Also: Super Jodi: అద్భుతమైన ప్రదర్శనలతో సూపర్ జోడి రెండో ఎపిసోడ్ రెడీ…

ఇక, ఈ విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీ పదే పదే బీజేపీపై తప్పుడు ఆరోపణలు చేస్తుందని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా, ఎంపీ రమేశ్ బిధూరి, ఎంపీ ప్రవేశ్ వర్మ, మనోజ్ తివారీ తదితర నేతలు మంగళవారం ఢిల్లీ పోలీస్ కమిషనర్‌ను కలిసి మొత్తం వ్యవహారంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బీజేపీ నేతల డిమాండ్ మేరకు ఢిల్లీ పోలీస్ కమిషనర్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తును క్రైం బ్రాంచ్‌కు అప్పగించారు.

Exit mobile version