NTV Telugu Site icon

Aruri Ramesh: గ్రామాలే నాకు దేవాలయాలు, ప్రజలే నాకు దేవుళ్ళు..

Arurri

Arurri

హన్మకొండ హంటర్ రోడ్డులోని సీఎస్ఆర్ గార్డెన్స్ లో బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ అధ్యక్షతన వర్ధన్నపేట బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఇటీవల మరణించిన జనగామ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పాగాల సంపత్ రెడ్డి చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం అరూరి రమేష్ మాట్లాడుతూ.. 2013లో నియోజకవర్గ బాధ్యతలు తీసుకున్నప్పటినుండి పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అండగా ఉంటున్నట్లు పేర్కొ్న్నారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతం చేయడమే ప్రథమ కర్తవ్యం.. పార్టీ నాయకులను, కార్యకర్తలను సర్పంచులుగా, ఎంపిటిసిలుగా గెలిపించుకోవడమే లక్ష్యమని చెప్పారు.

Ambati Rambabu: టీడీపీ అలసత్వం వల్లే గుండ్లకమ్మ ప్రాజెక్టుకు నష్టం

2014, 2018లో పార్టీ గెలుపు కోసం ప్రతీ ఒక్కరూ కృషి చేశారని అరూరి రమేష్ అన్నారు. ఈ ఎన్నికలలో జరిగిన దానికి ఎవరు బాధ పడవద్దు.. అధికారం మాత్రమే మన ధ్యేయమని తెలిపారు. ప్రజా సంక్షేమమే మన లక్ష్యం.. పార్టీ గెలుపు కోసం ప్రతీ కార్యకర్త కృషి చేశారని చెప్పారు. పార్టీ కోసం పాటుపడిన ప్రతీ ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యమ పార్టీ మనది.. ఉద్యమ స్పూర్తితోనే ముందుకు వెళ్దామని కార్యకర్తలకు సూచించారు. త్వరలో జరగబోయే సర్పంచ్ ఎన్నికలలో గులాబీ జెండా ఎగరాలని రమేష్ తెలిపారు.

Ambati Rambabu: టీడీపీ అలసత్వం వల్లే గుండ్లకమ్మ ప్రాజెక్టుకు నష్టం

మీ బిడ్డ అరూరి.. మీ వెంటే ఉంటాడు.. మీ కష్ట సుఖలలో పాలుపంచుకుంటా.. 24 గంటలు అందుబాటులో ఉంటానని అన్నారు. గ్రామాలే నాకు దేవాలయాలు, ప్రజలే నాకు దేవుళ్ళు అని రమేష్ చెప్పారు. ఎన్నికలలో గెలుపు ఓటములు సహజం.. ఎవరూ అధైర్య పడవద్దు.. మరింత ఉత్సాహంతో ముందుకు వెళ్దాం.. రాబోయే ఎన్నికలలో గులాబీ జెండా ఎగురవేద్దామని పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలకు తెలిపారు.

Show comments