Site icon NTV Telugu

Arunkumar Jain : 2022-2023 ఆర్థిక సంవత్సరంలో దక్షిణ మధ్య రైల్వే అనేక విజయాలు సాధించింది

Arun Kumar Jain

Arun Kumar Jain

2022-2023 ఆర్థిక సంవత్సరంలో దక్షిణ మధ్య రైల్వే అనేక విజయాలు సాధించిందని వెల్లడించారు దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. దక్షిణ మధ్య రైల్వే 131.854 మిలియన్ టన్నుల సరుకు రవాణా ద్వారా 13051.10 కోట్ల ఆదాయం నమోదు చేసిందని వెల్లడించారు. 2022 – 2023 ఆర్థిక సంవత్సరం మధ్య ప్రయాణీకుల ద్వారా 5140.70 కోట్ల ఆదాయాన్ని నమోదు చేయగా గత ఏడాది 2974.62 కోట్లు నమోదు చేసిందని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా.. టికెట్ తనిఖీ ద్వారా 211.26 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసిందని, దక్షిణ మధ్య రైల్వే ప్రారంభమైనప్పటి నుండి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అత్యుత్తమ ట్రాక్ జోడింపును సాధించిందని ఆయన తెలిపారు.

Also Read : Hardik Pandya: హార్దిక్ అరుదైన ఘనత.. రాజస్థాన్ చెత్త రికార్డ్.. తొలిసారి రివేంజ్

49.8 కిలో మీటర్ల కొత్త లైన్లు, 151.38 కిలో మీటర్ల డబ్లింగ్, 182.17 కిలో మీటర్ల ట్రిప్లింగ్ పూర్తయ్యాయని ఆయన వెల్లడించారు. ఫలితంగా 383.35 కిలో మీటర్ల ట్రాక్ దక్షిణ మధ్య రైల్వే నెట్‌వర్క్‌కు జోడించబడిందని ఆయన వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1017 రూట్ కిలోమీటర్ల విద్యుదీకరణ పూర్తయిందని, సికింద్రాబాద్ – కాజీపేట మధ్య హై డెన్సిటీ నెట్‌వర్క్ సెక్షన్‌లో గరిష్టంగా 130 Kmph వేగంతో రైళ్లను నడపడానికి అనుమతిని పొందిందన్నారు. వర్క్‌షాప్ చరిత్రలో అత్యధిక ఫలితాలు రైలు బోగీ కార్ఖానా, యాద్గిర్ ఈ సమయంలో అత్యధికంగా 482 బోగీ ఫ్రేమ్‌లను సాధించిందని, దక్షిణ మధ్య రైల్వే ప్రస్తుత సంవత్సరంలో అత్యధిక స్క్రాప్ విక్రయాలను 391 కోట్లతో నమోదు చేసిందన్నారు. నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డ్స్ 2022 సందర్భంగా, కాచిగూడ, గుంతకల్ రైల్వే స్టేషన్‌లకు రవాణా విభాగంలో దక్షిణ మధ్య రైల్వే మొదటి, రెండవ బహుమతులను పొందిందని, తెలంగాణ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డులు 2022లో దక్షిణ మధ్య రైల్వే రెండు స్వర్ణాలను అందుకుందని ఆయన తెలిపారు.

Also Read : Sunil Gavaskar: ధోని లాంటి కెప్టెన్ లేడు.. ఇక ముందు రాలేడు..

Exit mobile version