Arshdeep Singh-Samreen Kaur: హార్ట్, లాక్ ఎమోజీలే చెప్పేస్తున్నాయా..? అర్ష్‌దీప్-సమ్రీన్ రిలేషన్‌పై మళ్లీ చర్చ..!

Arshdeep Singh Samreen Kaur

Arshdeep Singh Samreen Kaur

Arshdeep Singh-Samreen Kaur Relationship: టీమిండియా స్టార్ ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్, పంజాబీ నటి-మోడల్ సమ్రీన్ కౌర్‌కు సంబంధించిన సోషల్ మీడియా పోస్ట్‌పై చేసిన కామెంట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య రిలేషన్‌షిప్ ఉందనే ప్రచారం జరుగుతుండగా.. కొత్తగా ఇన్‌స్టాగ్రామ్ ఎమోజీ ఎక్స్చేంజ్ ఆ వార్తలకు మరింత బలం చేకూర్చింది.

సమ్రీన్ కౌర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక షార్ట్ వీడియోను షేర్ చేసింది. ఆ వీడియోపై అర్ష్‌దీప్ సింగ్ ఎలుగుబంటి (🐻), రెడ్ హార్ట్ (❤️) ఎమోజీలతో స్పందించాడు. దీనికి సమ్రీన్ కూడా రెడ్ హార్ట్ (❤️)తో పాటు లాక్ (🔒) ఎమోజీని రిప్లైగా పెట్టింది. ఈ సంభాషణను అభిమానులు వెంటనే గమనించి సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు. వీరిద్దరూ తమ సంబంధంపై ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోయినా.. ఈ ఎమోజీల మార్పిడి చర్చనీయాంశంగా మారింది.

ఇక అర్ష్‌దీప్ సింగ్ విషయానికి వస్తే.. గడిచిన ఇంగ్లాండ్ పర్యటనలో భారత జట్టు తరఫున వైట్‌బాల్ సిరీస్‌లో ఆడాడు. ముఖ్యంగా టీ20 సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా నిలిచాడు. అయితే వన్డేల్లో మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ఒక్క వన్డేలో వికెట్ లేకుండా 72 పరుగులు సమర్పించుకున్నాడు. ఇదిలా ఉండగా, ఆగస్టు 23 నుంచి ప్రారంభం కానున్న దులీప్ ట్రోఫీ కోసం నార్త్ జోన్ జట్టులో అర్ష్‌దీప్ సింగ్‌కు చోటు లభించింది. జమ్మూ అండ్ కాశ్మీర్ వికెట్‌కీపర్-బ్యాటర్ కన్హయ్య వధావన్‌ను జట్టు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. గతంలో ఇంగ్లాండ్ టూర్ సందర్భంగా టెస్టు జట్టులో చోటు దక్కినప్పటికీ గాయం, జట్టు కాంబినేషన్ కారణంగా అర్ష్‌దీప్‌కు టెస్టు అరంగేట్రం చేసే అవకాశం రాలేదు.