PCB Files Complaint Against Arshdeep Singh: పాకిస్థాన్ బుద్ధి మారడం లేదు. తాజాగా ఫైనల్ మ్యాచ్‌కు ముందు భారత ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్‌పై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC)కి ఫిర్యాదు చేసింది. అర్ష్‌దీప్ ప్రేక్షకుల పట్ల “అభ్యంతరకరమైన” సంజ్ఞలు చేశాడని పీసీబీ ఆరోపించింది. పాకిస్థాన్ వార్తా వెబ్‌సైట్ జియో టీవీ ఈ విషయంపై ఒక నివేదికను ప్రచురించింది. 2025 ఆసియా కప్‌లో పాకిస్థాన్-ఇండియా సూపర్ ఫోర్ మ్యాచ్ ముగిసిన తర్వాత.. సెప్టెంబర్ 21న అర్ష్‌దీప్ ప్రేక్షకుల పట్ల అభ్యంతరకరమైన సంజ్ఞ చేశాడని పేర్కొన్నారు. అర్ష్‌దీప్ ప్రవర్తన అనైతికంగా ఉందని, ఆట ప్రతిష్టను దెబ్బతీసిందని పేర్కొంది. ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు భారత ఫాస్ట్ బౌలర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
READ MORE: ఐశ్వర్య మీనన్:సౌందర్యం మరియు సంప్రదాయం యొక్క సమ్మేళనం
అయితే.. ఇటీవల భారత్, పాకిస్థాన్ మధ్య ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, హరిస్ రవూఫ్ ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు దోషులుగా తేలింది. సూర్యకుమార్ యాదవ్, హరిస్ రవూఫ్ ఇద్దరికీ జీతంలో 30% జరిమానా విధించింది. ఈ అంశంపై ఇటు బీసీసీఐ, అటు పీసీబీ రెండూ సవాలు చేశాయి. సూర్యకుమార్ యాదవ్ పాకిస్థాన్‌తో జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో విజయాన్ని పహల్గామ్ దాడి బాధితులకు, భారత సైన్యానికి అంకితం చేసిన విషయం తెలిసిందే. ఈ అంశాన్ని పీసీబీ లేవనెత్తి చర్యలు తీసుకునేలా చేసింది.
READ MORE: IND vs PAK: ఈ లెక్కన గెలుపు మనదే..! ఆసియా కప్‌లో భారత్, పాక్ ఎన్నిసార్లు ఫైనల్‌కు వెళ్లాయంటే..?
