Arshdeep Singh: బుమ్రా రికార్డుకు బ్రేక్.. టీ20 వరల్డ్‌కప్‌లో అర్ష్‌దీప్ నయా హిస్టరీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arshdeep Singh: చైన్నై వేదికగా జరిగిన భారత్ vs జింబాబ్వే మ్యాచ్ టీమిండియాకు భారీ విజయంగా మారింది. ఏకంగా 72 పరుగులు తేడాతో భారత్ గెలవడంతో సెమీస్ ఆశలు పుంజుకున్నాయి. ఇక ఈ మ్యా్చ్లో లెఫ్ట్ హ్యాండ్ బౌలర్ అర్షదీప్ సింగ్ మరో చరిత్ర సృష్టించాడు. 4 ఓవర్లలో కేవలం 24 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అంతేకాదు.. 3 వికెట్లు పడగొట్టిన అర్ష్‌దీప్, టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌కు ముందు ఆ రికార్డు బుమ్రా పేరిట ఉండేది. బుమ్రా 33 వికెట్లతో ముందుండగా, అర్ష్‌దీప్ ఈ మ్యాచ్‌తో తన మొత్తం వికెట్ల సంఖ్యను 35కు చేర్చి యార్కర్ కింగ్‌ను అధిగమించాడు. కేవలం 19 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించడం విశేషంగా మారింది. అర్షదీప్ సింగ్ సగటు 14.25 కాగా, ఎకానమీ 7.33గా ఉండటం బౌరల్ స్థిరత్వాన్ని సూచిస్తోంది. ప్రస్తుత టోర్నీలోనూ ఐదు ఇన్నింగ్స్‌ల్లో 8 వికెట్లు తీసి జట్టులో రెండో అత్యధిక వికెట్ల బౌలర్‌గా కొనసాగుతున్నాడు.
READ MORE: Nikhil : ఓటీటీలోకి నిఖిల్ ఎంట్రీ.. యంగ్ హీరో ప్లానింగ్ మాములుగా లేదుగా!
Also Read
- CM Chandrababu: రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం..!
- Nirmala Sitharaman: "మరో సంక్షోభం ముంచుకొస్తోంది".. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
- Boyapati Srinu: బాలయ్య అభిమానులకు గుడ్‌న్యూస్.. అఖండ-3పై కీలక అప్డేట్..!
- Gautam Gambhir: "కేవలం టాలెంట్ ఉంటే సరిపోదు".. వైభవ్ సూర్యవంశీకి బిగ్ షాక్ ఇచ్చిన కోచ్ గంభీర్..
జింబాబ్వే ఇన్నింగ్స్ ఆరంభంలోనే అర్ష్‌దీప్ తన ముద్ర వేశాడు. మొదటి ఓవర్లో కేవలం నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చి ప్రత్యర్థి జట్టుకు ఒత్తిడి సృష్టించాడు. రెండో ఓవర్లో తొమ్మిది పరుగులు వచ్చినా, చివరి దశలో తిరిగి వచ్చి మ్యాచ్‌ను పూర్తిగా భారత్ వైపు తిప్పేశాడు. 17వ ఓవర్లో సికందర్ రజా (21 బంతుల్లో 31)ను లాంగ్-ఆన్ వద్ద క్యాచ్ అవుట్ చేయించాడు. వెంటనే ర్యాన్ బర్ల్‌ను ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేసి రెండు బంతుల్లో డక్‌గా పెవిలియన్‌కు పంపించాడు. చివరి ఓవర్లో టోనీ మున్యోంగా స్టంప్స్‌ను ఎగరగొట్టి తన మూడు వికెట్ల ప్రదర్శనను పూర్తి చేశాడు. మొత్తం మీద 184/6కే జింబాబ్వేను పరిమితం చేసి భారత్‌కు సునాయాస విజయం అందించాడు. ఇక ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 256/4 భారీ స్కోరు సాధించింది. ఈ టోర్నీలో అంతగా రాణించని అభిషేక్ శర్మ ఈ మ్యాచ్‌లో చెలరేగి 30 బంతుల్లో 55 పరుగులతో తన తొలి అర్ధశతకం నమోదు చేశాడు. అతని దూకుడు ఆరంభం జట్టుకు బలమైన పునాది వేసింది. చివర్లో పాండ్యా (23 బంతుల్లో అజేయ 50), తిలక్ వర్మ (16 బంతుల్లో అజేయ 44) కేవలం 31 బంతుల్లో 81 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసి జింబాబ్వే బౌలర్లను తిప్పలు పెట్టారు. ఎట్టకేలకు మ్యాచ్ గెలిచి సెమీస్ ఆశలు పెంచారు.
READ MORE: Pakistan: పాకిస్థాన్ సంచలన నిర్ణయం.. ఆఫ్ఘనిస్థాన్‌తో ‘ఓపెన్ వార్’ ప్రకటన.. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు!
తాజావార్తలు
-
CM Chandrababu: రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం..!
-
Vizag Navy Sailor : పాక్ హనీట్రాప్‌లో వైజాగ్ నేవీ సైలర్.. కోయంబత్తూరులో అరెస్ట్
-
Nirmala Sitharaman: “మరో సంక్షోభం ముంచుకొస్తోంది”.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
-
Boyapati Srinu: బాలయ్య అభిమానులకు గుడ్‌న్యూస్.. అఖండ-3పై కీలక అప్డేట్..!
-
Gautam Gambhir: “కేవలం టాలెంట్ ఉంటే సరిపోదు”.. వైభవ్ సూర్యవంశీకి బిగ్ షాక్ ఇచ్చిన కోచ్ గంభీర్..
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?