NTV Telugu Site icon

Sex scandal case: ప్రజ్వల్ రేవణ్ణకు అరెస్ట్ వారెంట్ జారీ

Prae

Prae

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక వేధింపుల కేసులో హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు సిట్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. పలుమార్లు ప్రజ్వల్‌కు దర్యాప్తు సంస్థ నోటీసులిచ్చింది. అయినా విచారణకు హాజరుకాలేదు. దీంతో ఆయనకు తాజాగా అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.

ఇది కూడా చదవండి: AP Violence: బాటిళ్లలో పెట్రోల్, డీజిల్ పోయవద్దు: ఈసీ

మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన నేపథ్యంలో ఆయనపై కేసు నమోదైంది. లోక్‌సభ ఎన్నికల రెండో విడత పోలింగ్ ముగిశాక.. వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. వీడియోలు బయటకు రాగానే ప్రజ్వల్ ఏప్రిల్ 27న దౌత్యపరమైన పాస్‌పోర్టు ఉపయోగించి దేశం విడిచి వెళ్లిపోయాడు. ప్రస్తుతం జర్మనీలో ఉన్నట్లు సిట్ అనుమానిస్తోంది. మరోవైపు కర్ణాటక ప్రభుత్వం ఆయనపై బ్లూ కార్నర్ నోటీసు కూడా జారీ చేసింది.

ఇదిలా ఉంటే ప్రజ్వల్ వీడియోల వ్యవహారంపై జేడీఎస్‌ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ తొలిసారి స్పందించారు. ఈ కేసు నుంచి ఎవరూ తప్పించుకోకూడదన్నారు. ఇందులో చాలా మందికి ప్రమేయం ఉందని, వారిని వదిలిపెట్టకూడదని వ్యాఖ్యానించారు.

ఇదిలా ఉంటే కిడ్నాప్‌ కేసుకు సంబంధించి కర్ణాటక మాజీ మంత్రి, ప్రజ్వల్ తండ్రి హెచ్‌డీ రేవణ్ణకు ఇటీవల బెయిల్ వచ్చింది. తనయుడి లైంగిక దౌర్జన్యం ఆరోపణలకు సంబంధించి బాధిత మహిళను అపహరించిన కేసులో మే 4న ఆయన్ను ప్రత్యేక దర్యాప్తు బృందం అరెస్టు చేసింది. అరెస్టు సమయంలో ఆయన అధికారులకు సహకరించలేదు. సాయంత్రం 6.50 తర్వాత సిట్ అధికారుల ముందు లొంగిపోయారు. ఇక ప్రజ్వల్‌ను స్వదేశానికి తీసుకువచ్చే ప్రయత్నాలు మాత్రం ఫలించలేదు.

ఇది కూడా చదవండి: Shocking Video: వామ్మో.. ఈయన ఎవరండీ బాబు.. పుచ్చకాయ కొనకపోతే ఏం చేస్తాడేమో ఏంటో..