KL University: కెఎల్ యూనివర్శిటీ లేదా కేఎల్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫౌండేషన్ (KLEF) నాక్ (NAAC) ప్రతినిధుల అరెస్టుపై సీబీఐ తన విచారణను కొనసాగిస్తోంది. సీబీఐ రిమాండ్ రిపోర్ట్ ప్రకారం, నాక్ తనిఖీ బృందంలో తమకు అనుకూలంగా ఉండే వారు సభ్యులుగా ఉండి, అనుకూలమైన రిపోర్టు ఇచ్చేలా కేఎల్ యూనివర్శిటీ ప్రతినిధులు కుట్రపన్నారని తెలుస్తోంది. KLEF అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ, వైస్ ఛాన్సలర్ సారథి వర్మ, నాక్ డెరైక్టర్ హనుమంతప్ప, మాజీ వైస్ చాన్సలర్ మంజునాథ రావు, సలహాదారు శ్యాం సుందర్‌తో కలిసి నాక్ సభ్యులతో అనేక మార్లు రహస్యంగా సమావేశమయ్యారు. ఇందులో భాగంగా జనవరి 18, 19 తేదీలలో బెజవాడ వచ్చిన హనుమంతప్ప, శ్యాం సుందర్‌కు 10 లక్షల రూపాయలు లంచంగా అందజేయడం జరిగింది. అలాగే ఇతర ప్రముఖులు కూడా ఈ కుట్రలో భాగస్వాములు అయ్యారని సమాచారం.
Also Read: CM Chandrababu: ‘ఆప్’ పాలనపై ఏపీ సీఎం విమర్శలు
KLEF వైస్ ప్రెసిడెంట్ రాజా హరీన్ మరియు హైదరాబాద్ క్యాంపస్ డెరైక్టర్ రామ కృష్ణ తదితరులు నాక్ సర్వ సభ్య సమన్వయకర్త రాజీవ్ సిజా రియాను గత నెల 25న ఢిల్లీలో కలుసుకోగా 1.80 కోట్ల రూపాయలను డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఆ చర్చల అనంతరం వారు నాక్ సభ్యులకు 3 లక్షలు, ఒక ల్యాప్‌టాప్ అలాగే.. చైర్మన్, రాజీవ్ సజరియాకు చెరో 10 లక్షలు ఇవ్వాలని అంగీకరించారు. ఈ లంచం మొత్తం నగదు, బంగారం రూపంలో అందజేయబడింది. ఈ రహస్య లావాదేవీలకు సంబంధించి మరింత సమాచారాన్ని సీబీఐ తన విచారణలో పొందింది. ఒక పరిక్షణలో రాజీవ్ సజరియా మరో 60 లక్షల రూపాయలు అడిగారు. కానీ కేఎల్ యూనివర్శిటీ ప్రతినిధులు 15 లక్షల రూపాయలు మాత్రమే ముట్టజెప్పారు. మొత్తానికి ఈ కేసు ప్రస్తుతం సీబీఐ వేదికగా విచారణ కొనసాగుతుంది. ఈ ఘటనతో నాక్ నాణ్యత తనిఖీ ప్రక్రియపై తీవ్ర ప్రశ్నలు తలెత్తుతోంది.