Site icon NTV Telugu

Fraud: ప్రభుత్వ పదవులు ఇప్పిస్తానంటూ కోట్లు కొట్టేసిన యువకుడి అరెస్ట్..

Frud

Frud

డబ్బులు ఉన్న వారే టార్గెట్ గా కొందరు వ్యవహరిస్తారు. కొందరికి ఉద్యోగాలు, పదవులు, డబ్బులు ఆశా చూపిస్తూ.. వారిని నిలువునా మోసం చేసేస్తారు. అయితే, ఇప్పటి వరకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మోసం చేసిన కేటుగాళ్లు ఎందరో ఉన్నారు.. కానీ, ఫస్ట్ టైం ప్రభుత్వ పదవులు ఇప్పిస్తానంటూ కోట్ల రూపాయలు వసూలు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, నిందితుడు విశ్వతేజగా పోలీసులు గుర్తించారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ బంగారపు షాపు యజమాని దగ్గర, రాజ్యసభ సీటు ఇప్పిస్తానని చెప్పి కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Read Also: Putin: పుతిన్‌కి ఘనస్వాగతం పలికిన చైనా.. రష్యాతో స్నేహంపై జిన్‌పింగ్ ప్రశంసలు..

అలాగే, రామచంద్రపురానికి చెందిన మరో రాజకీయ నాయకుడు దగ్గర ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇప్పిస్తానంటూ కూడా కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు విశ్వతేజపై అనేక ఆరోపణలు ఉన్నాయి. ఇక, తాజాగా చెన్నై, నంద్యాల, నెల్లూరు, ఈస్ట్ గోదావరి ప్రాంతాల్లో ఉన్న వ్యాపారులనే విశ్వతేజ అనే యువకుడు టార్గెట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. గత కొద్ది నెలలుగా అక్రమంగా వసూలు చేసిన డబ్బుతో, విలాసవంతమైన జీవితాన్ని అతడు గడపటం, భారీగా ఆస్తులు కూడా పెట్టడం లాంటి వ్యవహారాలతో పోలీసులు అప్రమత్తమైయ్యారు. అయితే, విశ్వతేజపై వస్తున్న ఆరోపణలతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రముఖుల పేర్లు చెప్పి డబ్బు వసూలు చేస్తున్నట్లు వస్తున్న ఆరోపణలపై లోతైన విచారణను పోలీసులు చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు.

Exit mobile version