NTV Telugu Site icon

Khammam BRS Meeting: 100 ఎకరాల్లో సభ, 400 ఎకరాల్లో పార్కింగ్.. కనీవినీ ఎరగని స్థాయిలో..

Brs Meeting

Brs Meeting

Khammam BRS Meeting: ఖమ్మంలో ఈ నెల 18న కనీవినీ ఎరగని స్థాయిలో బహిరంగ సభ నిర్వహించేందుకు బీఆర్‌ఎస్‌ పార్టీ భారీ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. దేశం మెచ్చేలా సభకు సన్నాహాలు చేస్తోంది. సభకు రెండు రోజుల ముందే ఖమ్మం నగరం భారీ కటౌట్లు, హోర్డింగ్‌లతో గులాబిమయమైంది. ఈ సభకు సుమారు 5 లక్షల మంది జనసమీకరణ చేయాల్సిందిగా సీఎం కేసీఆర్‌ ఇప్పటికే పార్టీ నేతలకు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా.. ఈ బహిరంగ సభకు ముగ్గురు ముఖ్యమంత్రులు హాజరవుతారని ముందునుంచి చెప్పుకొస్తున్నారు. అయితే.. తెలంగాణ సరిహద్దు జిల్లా కావడంతో.. 3 రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఈ సభలో పాల్గొంటారని తెలుస్తోంది.

ఇప్పటికే ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లను బీఆర్‌ఎస్‌ నేతలు పరిశీలించారు. దాదాపు ఏర్పాట్లు పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఈ నెల 18వ తేదీన జరగనున్న ఈ సభతో దేశ రాజకీయాలు మలుపు తిరుగుతాయని బీఆర్‌ఎస్‌ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీగా అవవతరించిన తర్వాత నిర్వహిస్తున్న తొలి బహిరంగ సభ కావడంతో ఏర్పాట్లు భారీగా ఉండేలా చూసుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. ఇప్పటికే బీఆర్‌ఎస్‌ నేతలు సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే.. ఖమ్మం సభ బాధ్యతలను హరీష్‌రావుకు అప్పగించడంతో ఆయన ఖమ్మంలో సమావేశాలు నిర్వహిస్తూ బీఆర్‌ఎస్‌ నేతలతో ముచ్చటిస్తున్నారు.

Pawan Kalyan: ఈ నెల 24న కొండగట్టు, ధర్మపురి క్షేత్రాలకు పవన్

దీనిలో భాగంగా సభను ఏకంగా 100 ఎకరాల్లో దేశం నివ్వెరపోయేలా బీఆర్‌ఎస్‌ పార్టీ ప్లాన్‌ చేస్తోంది. కొత్త కలెక్టరేట్ వెనక ఉన్న స్థలంలో బహిరంగ సభ ఏర్పాట్లు రూపుదిద్దుకుంటున్నాయి. ముగ్గురు ముఖ్యమంత్రులు, జాతీయ నేతలు హాజరవుతున్న సభకు 5లక్షల మంది జన సమీకరణ చేస్తున్నారు. స్థానిక నేతలు ఇప్పటికే సభ కోసం జనసమీకరణలో నిమగ్నమయ్యారు. జన సమీకరణ కోసం బస్సులు, లారీలు, డీసీఎం సహా పలు వాహనాలను సమకూరుస్తున్నారు. భారీగా తరలివచ్చే కార్యకర్తలు ప్రజానీకం ఎలాంటి ఇబ్బందులు పడకుండా సభాప్రాంగణం ప్రాంతంలో 400 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీఐపీలకు ప్రత్యేక పార్కింగ్ సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు. సభా వేదిక ఎదుట 20 వేల కుర్చీలు వీఐపీల కోసం ఏర్పాటు చేస్తున్నారు. మహిళలకు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నారు. సభా ప్రాంగణం లోపల, బయటా సుమారు అతిపెద్ద 50 ఎల్‌ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నారు. సభకు వచ్చిన వారి కోసం పది లక్షల మంచి నీటి ప్యాకెట్లు, వెయ్యి మంది వాలంటీర్లు అందుబాటులో ఉంటారని నేతలు చెబుతున్నారు. సభ నేపథ్యంలో ఖమ్మం నగరమంతా ఇప్పటికే గులాబీమయమైంది.

Show comments