తెలంగాణ రాష్ట్ర ప్రజల విశిష్ట సంస్కృతికి నిలువెత్తు ప్రతీక పూల పండుగ బతుకమ్మ. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత బతుకమ్మను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు. నేడు ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలకు సర్వం సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆడబిడ్డలందరూ బతుకమ్మ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించుకునేందుకు రెడీ అవుతున్నారు. వరంగల్ వేయి స్తంభాల గుడిలో బతుకమ్మ ప్రారంభ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ఎంగిలిపు బతుకమ్మ వేడుకలకు నలుగురు మంత్రులు హాజరుకానున్నారు.
Also Read:Trade Talks: H-1B వీసా, టారిఫ్ టెన్షన్స్.. రేపు అమెరికాకు పియూష్ గోయల్..
డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పర్యాటకశాఖ సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క…పలువురు నేతలు నేడు వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. పూలను దేవతలుగా కొలిచే అపురూపమైన బతుకమ్మ పండుగ నిర్వహణకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు అధికారులు. తొమ్మిది రోజులపాటు ఆటపాటలతో పూల దేవతలను కొలువనున్నారు మహిళలు.
Also Read:Andhra Pradesh: వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీలు రూట్ మార్చేశారా..?
ఈ నేపథ్యంలో చారిత్రక వేయి స్తంభాల దేవాలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు అధికారులు. నగరవ్యాప్తంగా బతుకమ్మ ఉత్సవాలను జరుపుకునే ప్రాంతాలలో అన్ని సౌకర్యాలను ఏర్పాటుచేశారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా భారీ బందోబస్తు నిర్వహించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ప్రత్యేక దృష్టి సారించారు.
