Site icon NTV Telugu

Vizag: ఉమ్మడి విశాఖ జిల్లాలో పోలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి..

Vizag

Vizag

రేపు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటికే పట్టణాల్లో ఉండే ప్రజలు.. తమ సొంత గ్రామాలకు చేరుకుని ఓటేసేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు.. రాజకీయ నేతలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇదిలా ఉంటే.. గతం కంటే ఈసారి పోలింగ్ శాతం రికార్డు స్థాయిలో నమోదు అయ్యే అవకాశం కనిపిస్తోంది. కాగా.. పోలింగ్ ఏర్పాట్లకు సంబంధించి ఎన్నికల సంఘం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

Read Also: Delhi: రెండు ఆస్పత్రులకు బాంబు బెదిరింపులు.. బాంబ్ స్క్వాడ్ తనిఖీలు

ఉమ్మడి విశాఖ జిల్లాలో పోలింగ్ నిర్వహణకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 80 శాతం పోలింగ్ లక్ష్యంగా పెట్టుకోవడంతో ప్రతి ఒక్క ఓటరుకు అవకాశం కల్పించాలని ఆదేశాలు ఉన్నాయి. ఇప్పటికే పోలింగ్ బూత్లకు పోలింగ్ మెటీరియల్ తరలింపు పూర్తయింది. ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా సుమారు 40 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. విశాఖ 20,12,373 మంది, అనకాపల్లి జిల్లాలో 15 లక్షల 96,916 మంది.. అరకు, పాడేరు నియోజకవర్గంలో సుమారు 5 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. విశాఖ, అనకాపల్లి జిల్లాలలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ ప్రక్రియ జరగనుంది. అల్లూరు జిల్లాలోని అరకు, పాడేరు నియోజకవర్గాల్లో డ్రోన్లతో ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు పోలీసులు.

Read Also: Sandeshkhali: బెంగాల్ సందేశ్‌ఖాలీలో టెన్షన్.. తృణమూల్ ఎమ్మెల్యే సహాయకుడిపై దాడి..

Exit mobile version