Site icon NTV Telugu

Army Rescues Tourists: భారీ హిమపాతం.. 370 మంది పర్యాటకులను రక్షించిన ఆర్మీ

Indian Army

Indian Army

Army Rescues Tourists: దాదాపు 400 మంది పర్యాటకులు సిక్కింలో భారీ హిమపాతం తర్వాత చిక్కుకుపోయారు. శనివారం సుమారు 100 వాహనాలు నాథులా, సోమ్‌గో సరస్సు నుంచి తిరిగి వస్తుండగా నిలిచిపోయాయి. వెంటనే త్రిశక్తి కార్ప్స్ దళాలు, సివిల్ పోలీస్, సివిల్ అడ్మినిస్ట్రేషన్‌తో కలిసి చిక్కుకుపోయిన పర్యాటకులను రక్షించడానికి రెస్క్యూ మిషన్ ‘ఆపరేషన్ హిమ్రహత్’ను ప్రారంభించాయి.సహాయక చర్యలు మార్చి 11 అర్థరాత్రి వరకు కొనసాగాయి.

Read Also: Madhuri Dixit: బాలీవుడ్ నటి మాధురి దీక్షిత్‌ ఇంట తీవ్ర విషాదం

పర్యాటకులను సురక్షిత ప్రాంతాలకు తరలించి ఆశ్రయం, వెచ్చని దుస్తులు, వైద్య సహాయం, వేడి భోజనం అందించారు. 178 మంది పురుషులు, 142 మంది మహిళలు, 50 మంది పిల్లలు సహా పర్యాటకులు బస చేసేందుకు దళాలు వసతిని ఏర్పాటు చేశాయి.ఒక రోజు అనంతరం ఆదివారం ఉదయం డోజర్ల సాయంతో రహదారిని ప్రారంభించారు. వాహనాలు గ్యాంగ్‌టక్‌కు వెళ్లేందుకు వీలుగా రోడ్డు క్లియర్ చేయబడింది.

Exit mobile version