NTV Telugu Site icon

Armenian pm: ఆర్మేనియన్ ప్రధాని హెలికాప్టర్ ఎమర్జెన్సీ  ల్యాండింగ్

Arm

Arm

ఆర్మేనియాన్ ప్రధాని నికోల్ పషిన్యాన్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌కు పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా పైలట్ హెలికాప్టర్‌ను అత్యవసర ల్యాండింగ్ చేశారు. ప్రధాని క్షేమంగా ఉన్నారని, అక్కడ నుంచి ఆయన కారులో తన ప్రయాణాన్ని సాగించినట్లు ఆ దేశ మీడియా తెలిపింది.

ఇది కూడా చదవండి: CM Revanth: ముఖ్యమంత్రి అయిన తరువాత తొలిసారి కమాండ్ కంట్రోల్ సెంటర్కు సీఎం..

శనివారం ఉత్తర నగరమైన వనాడ్జోర్‌లో ఆర్మేనియాన్ ప్రధాని హెలికాప్టర్‌ అత్యవసర ల్యాండింగ్ అయింది. ఈ మేరకు ప్రధాని తన ఫేస్‌బుక్‌లో పోస్టుచేశారు. అనంతరం కారులో ఉత్తర అర్మేనియాలోని తాషిర్‌కు వెళ్లినట్లు సమాచారం. ఇదిలా ఉంటే గత ఆదివారం రాత్రి హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు అబ్రహీం రైసీ ప్రాణాలు కోల్పోయారు. ప్రతికూల వాతావరణం కారణంగా ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలి ప్రాణాలు విడిచారు.

ఇది కూడా చదవండి: Fake Doctors: తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి చర్యలు.. 50 మంది ఫేక్ డాక్టర్లు గుర్తింపు