Arjun Ram Meghwal: బీఎస్ఎఫ్ జవాన్లతో దీపావళి సంబరాలు.. కేంద్ర మంత్రికి తృటిలో తప్పిన ప్రమాదం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arjun Ram Meghwal: దీపావళి పండుగ వేళ కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ (Arjun Ram Meghwal)కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. బీఎస్ఎఫ్ (BSF) జవాన్లతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకుంటున్న సమయంలో ఆయన్ను ఆనుకుని ఒక స్కై షాట్ (Sky shot) రాకెట్ దూసుకెళ్లడంతో అక్కడ ఒక్కసారిగా కలకలం రేగింది. రాజస్థాన్‌లోని బికనేర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. బీఎస్ఎఫ్ హెడ్‌క్వార్టర్స్‌లో జవాన్లతో కలిసి మంత్రి దీపావళి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అందరితో కలిసి టపాసులు కాల్చే కార్యక్రమంలోనూ ఉత్సాహంగా పాలుపంచుకున్నారు. మంత్రి చేతిలో కాకరకాయ ఒత్తి పట్టుకుని ఒక స్కై షాట్ రాకెట్‌ను వెలిగించేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఈ అనూహ్య ఘటన జరిగింది.
మంత్రి రాకెట్‌ను వెలిగించడానికి ప్రయత్నిస్తుండగా.. సరిగ్గా అదే సమయంలో అక్కడే ఉన్న మరో వ్యక్తి అప్రమత్తంగా వ్యవహరించకుండా అదే స్కై షాట్‌కు నిప్పు పెట్టేశాడు. ఊహించని ఈ పరిణామానికి మంత్రి తేరుకునే లోపే, ఆ రాకెట్ అత్యంత వేగంగా ఆయన ముఖానికి అతి సమీపంగా దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో రాకెట్ నుంచి వెలువడిన నిప్పు రవ్వలు (Sparks) ఆయన బట్టలపై కూడా పడ్డాయి. ఈ హఠాత్పరిణామంతో అక్కడ ఉన్నవారందరూ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అయితే సమయస్ఫూర్తితో వ్యవహరించడం వల్ల పెద్ద ప్రమాదమే తప్పింది. మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్‌కి ఎలాంటి గాయాలు కాలేదు. ఆయన పూర్తిగా క్షేమంగా ఉన్నారని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆయన తన నివాసంలో సురక్షితంగా విశ్రాంతి తీసుకుంటున్నారు. పండుగ పూట బీఎస్ఎఫ్ క్యాంప్‌లో జరిగిన ఈ ఘటనతో కాసేపు టెన్షన్ వాతావరణం నెలకొన్నప్పటికీ, అంతా సురక్షితంగా బయటపడటంతో అక్కడివారంతా ఊపిరి పీల్చుకున్నారు.
Also Read
- AP SSC Exams 2027: పదో తరగతి పరీక్ష ఫీజు షెడ్యూల్ విడుదల.. ఫుల్ డీటెయిల్స్ ఇవే!
- Delhi Pollution: దీపావళి వేళ ఢిల్లీలో పొల్యూషన్ వార్.. పంజాబ్ పొలాలకు రాత్రికి రాత్రే నిప్పు వెనుక పెద్ద కుట్ర!
- Cancer Drug Prices Slashed: క్యాన్సర్ రోగులకు కేంద్రం భారీ ఊరట.. గరిష్టంగా 96.45% వరకు తగ్గిన ఔషధాల ధరలు.!
- Diwali Firecracker Accidents: హైదరాబాద్‌లో టపాసుల ప్రమాదాలు.. 60 మందికి కంటి గాయాలు.. 8 మందికి సర్జరీ.!
తాజావార్తలు
-
Arjun Ram Meghwal: బీఎస్ఎఫ్ జవాన్లతో దీపావళి సంబరాలు.. కేంద్ర మంత్రికి తృటిలో తప్పిన ప్రమాదం!
-
AP SSC Exams 2027: పదో తరగతి పరీక్ష ఫీజు షెడ్యూల్ విడుదల.. ఫుల్ డీటెయిల్స్ ఇవే!
-
Russia vs Ukraine: 4.5 లక్షల మరణాలు..రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అత్యంత దారుణమైన పోరాటం!
-
Delhi Pollution: దీపావళి వేళ ఢిల్లీలో పొల్యూషన్ వార్.. పంజాబ్ పొలాలకు రాత్రికి రాత్రే నిప్పు వెనుక పెద్ద కుట్ర!
-
Cancer Drug Prices Slashed: క్యాన్సర్ రోగులకు కేంద్రం భారీ ఊరట.. గరిష్టంగా 96.45% వరకు తగ్గిన ఔషధాల ధరలు.!
ట్రెండింగ్
-
Upcoming Smartphones: ఈ వారం లాంచ్ కానున్న కొత్త స్మార్ట్ఫోన్లు ఇవే.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Reno 17 సిరీస్..!
-
Airtel నుంచి ‘Buy 1 Get 1’ ఆఫర్.. ఆ ప్లాన్స్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే రెండుసార్లు ప్రయోజనం..!
-
Realme నుంచి పవర్ఫుల్ 5G ఫోన్లు.. 10,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో వచ్చేస్తున్న Realme 17 సిరీస్..!
-
IPL 2027: టీమిండియా పవర్ హిట్టర్‌పై కన్ను.. గుజరాత్ టైటాన్స్‌ది పెద్ద ప్లానే!
-
IPL 2027 Trade: డీల్ క్లోజ్.. పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్యా.. మ్యాచ్ విన్నర్‌ను వదులుకున్న ప్రీతి జింటా!