యూట్యూబ్ యాంకర్, బిగ్ బాస్ బ్యూటీ అరియానా గ్లోరీ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. బిగ్ బాస్ లో మెరిసిన ఈ అమ్మడు తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను తెచ్చుకుంది.. సోషల్ మీడియాలో హాట్ సెన్సేషన్ గా మారిపోయింది.. తన క్యూట్ వాయిస్ తో అరియనా యాంకర్ గా దూసుకుపోతోంది.. బుల్లితెరపై వస్తున్న పలు షోలల్లో కనిపిస్తూ యూత్ ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది.. ఎప్పుడు ఫోటోలను షేర్ చేస్తున్న ఈ అమ్మడు ఈ సారి పెద్ద సాహసమే చేస్తున్న వీడియోను షేర్ చేసింది.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది..
ఇక అరియనా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వరుస ఫోటో షూట్ లతో రచ్చ రచ్చ చేస్తుంది.. రోజు రోజుకు గ్లామర్ డోస్ పెంచుతుంది.. వెండి తెరపై రాణించాలని అనుకుంటోందో ఏమో.. అనసూయ, శ్రీముఖి లాంటి యాంకర్స్ తరహాలో తన అందాలు ఘాటుగా చూపించాలని డిసైడ్ అయింది.. ఈ మధ్య బొద్దుగా మారి తన సొగసుతో కుర్రాళ్ళకి వల వేస్తూ ఇచ్చిన ఫోజులు వైరల్ అవుతున్నాయి. ఆమె బాడీ పై నెటిజన్లు పలు రకాల కామెంట్స్ చేస్తున్నారు.. వాళ్లకు బుద్ది చెబుతూ వస్తుంది..
ఇదిలా ఉండగా తాజాగా దుబాయ్లో ల్యాండ్ అయ్యింది. అంతే కాకుండా అక్కడ ఫేమస్ అయిన స్కై డైవింగ్ అడ్వెంచర్ను ట్రై చేసింది. ఈ స్కై డైవింగ్కు సంబంధించిన మొత్తం వీడియోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది అరియానా. నాకోసం విధి చాలా పెద్దగానే ప్లానే వేసింది. దేవుడు నాకోసం ఇన్ని ఆశీస్సులు దాచి ఉంచాడని ఎప్పుడూ అనుకోలేదు. మీరు జీవించి ఉన్నారు అనిపించే విషయాలతో మాత్రమే మీ జీవితాన్ని నింపేసుకోండి.. అంటూ స్కై డైవ్ చేస్తున్న వీడియోను నెట్టింట షేర్ చేసింది ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది.. ఇది చూసిన నెటిజన్లు కూడా రకరకాలుగా స్పందిస్తున్నారు..