తన మధురమైన గాత్రంతో, దేశవ్యాప్తంగా కోట్ల మంది హృదయాలను కొల్లగొట్టిన బాలీవుడ్ స్టార్ సింగర్ అర్జిత్ సింగ్.. రిటేర్మెంట్ తిసుకుంటున్నట్లు ప్రకటించి అందరికి షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. సినిమా ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలుగుతున్న సమయంలో ఆయన ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సంగీత ప్రపంచంలో పెద్ద చర్చకు దారితీసింది. అయితే, ఈ వార్త విన్న ఆయన అభిమానులు అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన పాటలకు దూరం కావడం లేదు, కేవలం సినిమా ఇండస్ట్రీకి మాత్రమే దూరమవుతున్నారు.
Also Read : Bhumi : ఆరేళ్ల చిన్నారిపై సామూహిక దాడి.. వీధి కుక్కలపై చర్చిస్తాం.. కానీ, వీటిపై మాత్రం మాట్లాడం!
సినిమా పాటలకు గుడ్ బై చెప్పినా, సొంతంగా పాటలే చేయడం మాత్రం ఆపనని అర్జిత్ క్లారిటీ ఇచ్చారు అర్జిత్. అంటే సినిమాల్లో ఉండే కండిషన్లు, ఒత్తిడి లేకుండా తన మనసుకి నచ్చినట్లు ‘ఇండిపెండెంట్ మ్యూజిక్’ చేస్తానని.. ఒక కళాకారుడిగా తనకు నచ్చిన క్వాలిటీ మ్యూజిక్‌ను తన సొంత ఆల్బమ్స్ ద్యారా ప్రేక్షకులకు అందించడమే తన అసలు లక్ష్యమని ఆయన పేర్కోన్నారు. అర్జిత్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల భవిష్యత్తులో ఆయన నుంచి ఇంకా మంచి పాటలు వస్తాయని ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి అరిజిత్ నుంచి రాబోయే మొదటి సొంత పాట కోసం మ్యూజిక్ లవర్స్ అంతా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
