శేరిలింగంపల్లి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆరికెపూడి గాంధీ పేరును ప్రకటించడంతో గాంధీ నివాసం వద్ద గులాబీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా.. ప్రభుత్వ విప్ ఆరెకపుడి గాంధీ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యేగా నియోజక వర్గంలో చేసిన అభివృద్ధిని గుర్తించే సీఎం కేసీఆర్ మూడోసారి ఎమ్మెల్యేగా అవకాశం కల్పించారని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read : Ariyana Glory : ట్రెడిషనల్ వేర్ లో మెరిసిన అరియనా.. నడుము అందాలతో మత్తెక్కిస్తుందిగా…
బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేశామన్నారు. ముఖ్యమంత్రి పాలనా దక్షత, నియోజకవర్గంలో చేసిన అభివృద్ధినే రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తుందన్నారు ఆరెకపుడి గాంధీ. దేశంలో ఏ పార్టీలు చేయని అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్న నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆరెకపుడి గాంధీ కొనియాడారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి మరోసారి బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తుందని ఆరెకపుడి గాంధీ ధీమా వ్యక్తం చేశారు. ముచ్చటగా మూడోసారి గెలిచి ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కేటీఆర్ లకు కానుకగా అందిస్తానని ఆరెకపుడి గాంధీ అన్నారు.
Also Read : Heavy Rains: అగ్రరాజ్యం అమెరికాపై హరీకేన్ హిల్లరీ తుఫాన్ ఎఫెక్ట్
