NTV Telugu Site icon

Weight Gain: సన్నగా ఉన్నారని బాధపడుతున్నారా.. ఇవి తినండి 2 వారాల్లో బరువు పెరుగుతారు..!

Weight Gain

Weight Gain

ఈరోజుల్లో బరువు తగ్గడం చాలా కష్టం కానీ.. బరువు పెరగడం చాలా సులభం. కానీ కొందరు సన్నగా ఉన్నవారు.. ఏమీ తిన్న అంత తొందరగా బరువు పెరగరు. దీంతో తినరాని ఫుడ్స్ తీసుకుంటారు. కండరాలను పెంచుకోవడానికి, బరువు పెరగడానికి ఏవేవో డైట్లు ఫాలో అవుతుంటారు. కాగా.. బరువు పెరగడం, కండరాలను పొందడం చాలా కష్టం అంటున్నారు వైద్య నిపుణులు. అంతేకాకుండా.. రోగనిరోధక వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతుంది. దీనివల్ల త్వరగా అనారోగ్యానికి గురవుతారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్ని ప్రయత్నాలు చేసినా బరువు పెరగకపోతే ఏం తినాలి అనే ప్రశ్న తలెత్తుతుంది. మీ బరువును పెంచడంలో సహాయపడే కొన్ని మైదాల గురించి తెలుసుకుందాం. మీరు గోధుమలకు బదులుగా ఈ పిండితో చేసిన రోటీలను రోజు ఆహారంగా తీసుకుంటే.. బరువు పెరగడంలో సహాయపడతాయి.

INDIA bloc: ఢిల్లీలో ఒకటి మీకు, గుజరాత్‌లో 8 మాకు.. ఆప్-కాంగ్రెస్ మధ్య సీట్ల పంచాయతీ..

ఎండు కొబ్బరి
రోజు కొబ్బరి పిండిని ఉపయోగించండి. ఎండు కొబ్బరిని రుబ్బి ఈ పిండిని తయారు చేస్తారు. ఇది గ్లూటెన్ ఫ్రీ. గోధుమ పిండితో పోలిస్తే ఈ పిండిలో ఎక్కువ కేలరీలు, ప్రోటీన్, కొవ్వు, ఫైబర్, ఇనుము, పొటాషియం వంటి ఖనిజాలు ఉంటాయి. మీ బరువును ఆరోగ్యకరమైన రీతిలో పెంచడంతో పాటు, వాపును తగ్గించడంలో సహాయపడుతుంది.

బాదం పిండి
బాదం పిండి మీ బరువును పెంచడంలో ఎంతో సహాయపడుతుంది. ఈ పిండి తయారు చేయడానికి బాదంపప్పును మెత్తగా రుబ్బుకోవాలి. ఇది సహజంగా గ్లూటెన్ ఫ్రీ. బాదం పిండిలో మెగ్నీషియం, ఒమేగా-3 అసంతృప్త కొవ్వు, ప్రోటీన్, విటమిన్ ‘ఇ’ పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా.. ప్రోటీన్, కేలరీలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి బరువు పెరగడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచడంలో తోడ్పడుతుంది.

క్వినోవా పిండి
క్వినోవాను మెత్తగా రుబ్బి ఈ పిండిని తయారు చేస్తారు. ఈ పిండిలో చాలా ప్రోటీన్ ఉంటుంది. ఇది మీ బరువును పెంచడంలో సహాయపడుతుంది. ఈ పిండిలో ప్రోటీన్, ఫైబర్, ఐరన్, అసంతృప్త కొవ్వు ఉంటాయి. ఇవి బరువు పెరగడానికి సహాయపడుతుంది.