Site icon NTV Telugu

Paracetamol: పారాసిటమాల్ ఎక్కువగా వాడుతున్నారా.. బీ కేర్ ఫుల్..!

Paracetamal

Paracetamal

కొద్దిగా జ్వరం వచ్చినా, తలనొప్పి వచ్చినా వెంటనే వేసుకునే ట్యాబ్లెట్ పారాసిటమాల్.. ఈ ట్యాబెట్ దాదాపు అందరి ఇళ్లలోనూ ఉంటాయి. ఈ ట్యాబ్లెట్ వేసుకోగానే వెంటనే సమస్య తీరిపోతుంది. అయితే దీని వాడకంపై ఆరోగ్య నిపుణులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ ట్యాబ్లెట్ ఎక్కువగా వాడొద్దని.. ఆరోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు. నొప్పి ఎంత ఎక్కువగా ఉన్నా సరే డాక్టర్ సూచించిన డోస్ కంటే ఎక్కువ మోతాదులో వాడకూడదు. పారాసిటామాల్ ను తలనొప్పి, జ్వరం, ఒళ్లునొప్పులు, కడుపునొప్పి, పిరియడ్ క్రాంప్స్ ఇలా రకరకాల సమస్యలకు ఒకే పరిష్కారం కింద వాడుతున్నారు.

Read Also: Sandeep Reddy Vanga: చెప్పి కలెక్షన్స్ కొల్లగొట్టాడు.. చెప్పకుండా అవార్డు కూడా!

తాజాగా ఎడిన్‌బరో యూనివర్సిటీ నిర్వహించిన అధ్యయనంలో ఈ నిజం బయటపడింది. అయితే ఎలుకలపై పారాసిటమాల్ పరిశీలన చేశారు. దానివల్ల కలిగే మార్పులు ఏంటో తెలుసుకున్నారు. పారాసిటమాల్ వల్ల కాలేయం దెబ్బతిన్నట్టు గుర్తించారు. అటు.. పారాసిటమాల్‌ను ఎక్కువ శాతం వాడే రోగుల్లోనూ ఇలాంటి పరిస్థితులు ఉన్నట్లు కనుగొన్నారు. దీర్ఘకాలిక నొప్పులతో బాధపడుతున్నవారు రోజుకు 4 గ్రాముల వరకు పారాసిటమాల్ తీసుకోవడం వరకు మంచిదని, కానీ అంతకుమించి తీసుకుంటే మాత్రం ఆరోగ్యానికి ప్రమాదం అంటున్నారు.

Read Also: Dr. Laxman: అసాధ్యం అనుకున్న వాటిని సాధ్యం చేసిన వ్యక్తి మోడీ..

ఈ మాత్ర.. శరీర అవయవాల్లోని కీలకమైన నిర్మాణాన్ని పాడుచేస్తున్నట్టు పరిశోధకులు కనుగొన్నారు. కాలేయం, ఇతర అవయవాలకు మధ్యనున్న కణజాలాన్ని పారాసిటమాల్ దెబ్బతీస్తున్నట్టు ఓ పరిశోధనలో వెల్లడైనట్టు తెలిపారు. ముఖ్యంగా పారాసిటమాల్ ఎక్కువగా వాడటం వల్ల కాలేయం దెబ్బతింటుందని గుర్తించారు. ఎడిన్‌బరో యూనివర్సిటీతోపాటు ఓస్లో, స్కాటిష్ నేషనల్ బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్ సర్వీస్ పాల్గొన్న ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలు సైంటిఫిక్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

Exit mobile version