Site icon NTV Telugu

Health Tips: జలుబు, దగ్గుతో బాధపడుతున్నారా.. ఇంట్లోనే ఇలా చేస్తే మాయం..!

Cold

Cold

అక్టోబరు నెలలో వేడి శీతాకాలం ప్రారంభమవుతుంది. పగటిపూట వేడిగా ఉంటే.. రాత్రి చల్లగా ఉంటుంది. ఇలాంటి వాతావరణంలో జలుబు, దగ్గు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. జలుబు, దగ్గుతో తీవ్ర అవస్థలు పడుతూ.. వైద్యుల దగ్గరకు వెళ్లలేని స్థితిలో ఉంటారు. అలాంటి సమయంలో ఇంట్లోనే ఉంటూ విశ్రాంతి తీసుకుంటారు. అయితే ఇంట్లోనే ఉంటే విశ్రాంతి వలన ఇవి నయం కావు. వాటికి కొన్ని నివారణ చర్యలు ఉన్నాయి. అవి పాటిస్తే వెంటనే జలుబు, దగ్గు తగ్గిపోతుంది. ఇంతకీ నివారణ చర్యలు ఏంటీ.. శీతాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులను ఎలా నివారించవచ్చో తెలుసుకుందాం.

Nandamuri Kalyan Ram: డెవిల్.. మరో అద్భుతమైన ప్రాజెక్ట్ పట్టాడు

తేనె, నిమ్మకాయ టీ
ఒక కప్పు గోరువెచ్చని నీటిలో ఒక టేబుల్ స్పూన్ తేనె, అర నిమ్మకాయ రసం కలపండి. ఆ తర్వాత తాగితే గొంతు నొప్పి, దగ్గు నుండి ఉపశమనం పొందవచ్చు.

అల్లం టీ
అల్లం టీ తాగితే చాలా మంచిది. అల్లంలో సహజ యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. దీనితో దగ్గు, గొంతు నొప్పిని తగ్గిస్తుంది.

ఆవిరి
ఒక పెద్ద పాత్రలో నీటిని మరిగించండి. అది ఆవిరిగా మారిన తర్వాత కొన్ని చుక్కల యూకలిప్టస్ నూనె వేయండి. ఆ తర్వాత ఆవిరిని పీల్చుకోవడం కోసమని మీ తలపై ఏదైనా టవల్‌తో కప్పుకుని.. ఆవిరి పీల్చుకోవాలి. దీంతో ముక్కులో పేరుకుపోయిన కఫాన్ని క్లియర్ చేయడంలో సహాయపడుతుంది.

పసుపు పాలు
ఒక కప్పు పాలను వేడి చేసి అందులో ఒక చెంచా పసుపు వేయాలి. ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసి పడుకునే ముందు తాగాలి. పసుపులో సహజమైన యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉండటంతో.. జలుబు లక్షణాలను తగ్గించడంలో సహాయపడతాయి.

ఉప్పు నీరు పుక్కిలించాలి
ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో అర టీస్పూన్ ఉప్పు కలుపుకుని పుక్కిలించండి. ఇది గొంతు నొప్పిని తగ్గించడానికి, చికాకును తగ్గించడానికి సహాయపడుతుంది.

Exit mobile version