Site icon NTV Telugu

Summer Tips : ఎండలో వెళ్లొచ్చి వాటర్ తాగుతున్నారా? మీ ప్రాణాలు డేంజర్లో పడ్డట్లే..

Summer Waterr

Summer Waterr

వేసవికాలం వచ్చేసింది.. ఎండలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.. ఇప్పటికే ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. ఉదయం 9 దాటితే బయటకు వెళ్లాలంటే జనాలు భయంతో వణికిపోతున్నారు.. ఇక రాను రాను ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి.. ఇక అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని నిపుణులు చెబుతున్నారు.. పగటి పూట మాత్రమే కాకుండా రాత్రి కూడా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇండియాతో పాటు పలు దేశాల్లో కూడా ఎండల తీవ్రతలు పెరుగుతున్నాయి..

ఎండలకు బయటకు వెళ్ళేవాళ్లు తగు జాగ్రత్తలు కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.. ఎండలో వెళ్ళేటప్పుడు లేదా వెళ్లి వచ్చాక చల్లని నీళ్లను లేదా ఐస్ నీళ్లను తాగడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.. ఒకవేళ అలా చేస్తే మన శరీరంలోని చిన్న రక్తనాళాలు పగిలిపోయే అవకాశం ఉంది.. కాసేపు రిలాక్స్ అయ్యాక నీళ్లను తీసుకోవడం మంచిది..

బయట వేడి పెరిగే కొద్ది చల్లని నీళ్లను తీసుకోవడం కాదు.. గోరు వెచ్చని నీటిని నెమ్మదిగా తాగాలని వైద్యులు చెబుతున్నారు.. కాళ్లు, చేతులు వేడికి గురైనట్లయితే వెంటనే కడుక్కోవద్దని తెలిపారు. ఎండలో వెళ్లొచ్చాక స్నానం చేయాలనుకుంటే కనీసం అరగంటైనా వేచి చూడాలని నిపుణులు చెబుతున్నారు.. ఒకవేళ బయటకు వెళ్లి వెంటనే స్నానం చేస్తే ఇక అంతే.. దవడ గట్టిపడి, స్ట్రోక్‌ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు..

ఇక బయటకు వెళ్లి వచ్చాక చన్నీళ్లు తాగితే.. మనిషి గుండెలోని సిరలు, రక్తనాళాలు చాలా ఇరుకుగా ఉంటాయని, హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.. ఇక డీహైడ్రెషన్ కు గురవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.

Exit mobile version