Secunderabad: ఆందోళనలకు ముందుగానే ప్లాన్ చేశారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ఆందోళన చేసేందుకు ఆర్మీ అభ్యర్థులు ముందుగానే ప్లాన్ చేసుకున్నట్లు రైల్వే శాఖ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి గురువారం రాత్రే యువకులు హైదరాబాద్‌కు తరలివచ్చారని.. జిల్లాల వారీగా వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసుకుని, ఎప్పటికప్పుడు సమాచారం చేరవేసుకున్నట్లు తెలుసుకుని అధికారులు విచారణ చేపట్టారు. మరోవైపు తొలుత శుక్రవారం ఉదయం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ బయట ఓ బస్సు అద్దాలను ఆందోళనకారులు పగులగొట్టారు. ఉదయం 9 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా ఆందోళనకారులు లోపలకు దూసుకొచ్చారు. ఆ తర్వాత రైల్వేస్టేషన్‌లోని రైళ్లకు, ప్లాట్‌ఫారంపై పలు స్టాళ్లకు నిప్పంటించారు.
అటు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో యువకులపై పోలీసులు కాల్పులు జరపడంపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లు కాకుండా.. కాల్పులు జరిపే హక్కు ఎవరిచ్చారని నెటిజన్‌లు ప్రశ్నిస్తున్నారు. ఉన్నతాధికారుల నుంచి ఆర్డర్స్ ఉన్నాయా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. అమాయకంగా ఓ యువకుడి ప్రాణాలు తీశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాళ్లు వేయడంతోనే గాల్లోకి కాల్పులు జరిపినట్లు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) పోలీసులు చెబుతున్నారు. కానీ గాల్లోకి కాల్పులు జరిపితే దాదాపు 10 మందికి తీవ్ర గాయాలు ఎలా అయ్యాయని నిలదీస్తున్నారు. అయితే ప్రభుత్వ ఆస్తులకు తీవ్ర నష్టం కలిగిస్తూ ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేయడంతోనే తాము కాల్పులు చేయాల్సి వచ్చిందని పోలీసులు వివరిస్తున్నారు.
Also Read
తాజావార్తలు
-
Tollywood: సీక్వెల్ కావాలంటున్న స్టార్ హీరో.. ‘నో’ అంటున్న డైరెక్టర్!
-
BC Reservations: అసెంబ్లీ ముందుకు బీసీ రిజర్వేషన్ బిల్లు.. స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్స్..
-
RC17: రామ్ చరణ్ ఊరమాస్ మేకోవర్.. సుకుమార్ పక్కా స్కెచ్!
-
Explainer: పాక్ కొత్త పొత్తులు, పాత కక్షలు.. దాయాది దారి ఎటు?
-
Tamil Nadu: “విజయ్ ప్రియమైన త్రిషకు డిప్యూటీ సీఎం పదవి ఎప్పుడు.?” అన్నాడీఎంకే నేత సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..